Omicron: భారత్‌లో చాపకింద నీరులా వ్యాపిస్తున్న ఒమిక్రాన్‌.. ఇండియాలో నాలుగుకు చేరిన కేసులు

|

Dec 04, 2021 | 8:34 PM

Omicron:  భారత్‌లో ఒమిక్రాన్‌ వేరియంట్‌ భయాందోళనకు గురి చేస్తోంది. సౌతాఫ్రికాలో బయటపడ్డ ఈ వేరియంట్‌ ప్రపంచ దేశాలకు పాకింది. ఇప్పటి వరకు 38 దేశాలకు..

Omicron: భారత్‌లో చాపకింద నీరులా వ్యాపిస్తున్న ఒమిక్రాన్‌.. ఇండియాలో నాలుగుకు చేరిన కేసులు
Follow us on

Omicron: భారత్‌లో ఒమిక్రాన్‌ వేరియంట్‌ భయాందోళనకు గురి చేస్తోంది. సౌతాఫ్రికాలో బయటపడ్డ ఈ వేరియంట్‌ ప్రపంచ దేశాలకు పాకింది. ఇప్పటి వరకు 38 దేశాలకు పాకినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించింది. కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడు ఊపిరి పీల్చుకుంటున్న క్రమంలో మరో కేసు నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా మహారాష్ట్రలో మరో ఒమిక్రాన్‌ కేసు నమోదైంది. సౌతాఫ్రికా నుంచి దుబాయ్‌ మీదుగా ముంబైకి వచ్చిన ప్రయాణికుడికి ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు భారత్‌లో మొత్తం 4 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి.

ఇప్పటికే చాలా దేశాలకు వ్యాపించిన ఈ వేరియంట్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ దేశాలను అప్రమత్తం చేస్తోంది. ఇక ఈ వేరియంట్‌ భారత్‌లో కూడా వ్యాపించడంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది. సౌతాఫ్రికా నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించింది.

ఇప్పటికే కోవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకోకముందే మరో కొత్త వేరియంట్‌ వ్యాపించడంతో అందరిలో ఆందోళన మొదలైంది. సౌతాఫ్రికాలో పుట్టిన ఈ వేరియంట్‌.. డెల్టా వేరియంట్‌ కంటే అతి వేగంగా వ్యాపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీనిపై అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే అప్రమత్తం చేస్తోంది. దీంతో భారత్‌ కూడా అన్ని రాష్ట్రాలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. విదేశీ ప్రయాణికులకుపై ఆంక్షలు విధిస్తోంది.

 

ఇవి కూడా చదవండి:

Omicron: 38 దేశాలకు వ్యాపించిన ఒమిక్రాన్‌.. ఈ వేరియంట్‌ ప్రమాదమా..? ఎలాంటి లక్షణాలు ఉంటాయి..? WHO ఏమంటోంది..!

Corona Virus: రష్యాలో కరోనా మరణ మృదంగం .. గత అక్టోబర్‌లో భారీగా మరణాలు.. వ్యాక్సిన్ తప్పనిసరి చేసిన ప్రభుత్వం