ఉత్తరాఖండ్‌లో వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నదులు ప్రమాదకర రీతిలో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో రహదారులు మూతబడ్డాయి. పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెహ్రీలో కొండచరియలు విరిగిపడటంతో..రిషికేష్-గంగోత్రి జాతీయ రహదారి మూసివేశారు. విరిగిపడిన కొండచరియలను తొలగిస్తున్నారు సిబ్బంది. ఒక్కసారిగా పోటెత్తిన వరదకు డెహ్రాడూన్-రిషికేష్ బ్రిడ్జి కుప్పకూలిపోయింది. దీంతో ఆ ప్రాంతంలో వాహనాలు భారీగా నిలిచిపోయాయి.
మరోవైపు రుషీకేష్ సంగ్ నదిలో చిక్కుకున్న వారిని రెస్క్యూటీమ్ సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. నేషనల్ హైవేపై కొండచరియలు విరిగిపడి రోడ్డు కొట్టుకుపోవడంతో..తాత్కాలిక నిచ్చెనలు ఏర్పాటుచేసి..అక్కడ చిక్కుకున్న వారిని క్షేమంగా ఒడ్డుకు చేరుస్తున్నారు రెస్క్యూ సిబ్బంది. సంగ్ రివర్‌లో ఓ మహిళ సహా నలుగురు చిక్కుకుపోయారు..స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న NDRF సిబ్బంది వారిని సురక్షింతంగా బయటికి తీసుకొచ్చారు. ఈ రోజు షికేష్-గంగోత్రి జాతీయ రహదారిని ఈరోజు మూసివేశారు.
వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నదులు ప్రమాదకర రీతిలో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఒక్కసారిగా పోటెత్తిన వరదకు కుప్పకూలిపోయింది డెహ్రాడూన్-రిషికేష్ బ్రిడ్జి. దీంతో ఆ ప్రాంతంలో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఈ సంవత్సరం ఉత్తరాఖండ్ , హిమాచల్ ప్రదేశ్‌లో తరచుగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. కొన్ని రోజుల క్రితం, హిమాచల్ ప్రదేశ్ కిన్నౌర్‌లో కొండచరియలు విరిగిపడడంతో పెద్ద ప్రమాదం కూడా జరిగింది. ఆ సమయంలో అటుగా ప్రయాణిస్తున్న రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 30 మందికి పైగా మరణించారు.
#WATCH | Uttarakhand: Rishikesh-Gangotri national highway was blocked following a landslide near Narendra Nagar in Tehri, earlier today pic.twitter.com/qRUWNWnUIH
— ANI (@ANI) August 28, 2021
ఇవి కూడా చదవండి: TV9 Exclusive: ఆఫ్గన్ రణక్షేత్రంలో టీవీ9 మరో సాహసం.. తాలిబన్ అధికార ప్రతినిధి సుహైల్ షాహీన్ ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వ్యూ..
ED: బెంగాల్ మళ్లీ రాజకీయ రగడ.. దీదీ మేనల్లుడికి ఈడీ సమన్లు.. వెలుగులోకి బొగ్గు స్కాం..