చైనీస్ ఫుడ్, రెస్టారెంట్లపై కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు..

కేంద్రమంత్రి రాందాస్ అథవాలే చైనీస్ ఫుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై దేశంలో చైనీస్ ఫుడ్‌ను నిషేధించాలని.. వాటిని అమ్మే రెస్టారెంట్స్‌ను బ్యాన్ చేయాలన్నారు.

చైనీస్ ఫుడ్, రెస్టారెంట్లపై కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు..

Edited By:

Updated on: Jun 18, 2020 | 2:59 PM

కేంద్రమంత్రి రాందాస్ అథవాలే చైనీస్ ఫుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై దేశంలో చైనీస్ ఫుడ్‌ను నిషేధించాలని.. వాటిని అమ్మే రెస్టారెంట్స్‌ను బ్యాన్ చేయాలన్నారు. సోమవారం నాడు లదాఖ్‌లోని గాల్వన్‌ లోయలో భారత్‌-చైనా జవాన్ల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చైనీస్ వస్తువులను బహిష్కరించాలంటూ దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఇకపై ఆ దేశంలో తయారైన వస్తువులు మన దేశంలో కనిపించకూడదని.. వాటిని ఉపయోగించకూడదన్నారు. అంతేకాదు.. చైనాకు సంబంధించిన సాహిత్యాన్ని కూడా భారత్‌లో నిషేధించాలని కోరారు.

అటు చైనా తీరుపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిహద్దు విషయంలో చైనా పునరాలోచించుకోవాలని.. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. తాము ఏ దేశంతో కూడా యుద్ధం కోరుకోవడం లేదని.. ప్రస్తుతం కరోనాతో యుద్ధం చేస్తున్నామన్నారు. యుద్ధం వల్ల ఇరు దేశాలు అన్ని విధాలుగా నష్టపోతాయని.. మేం సరిహద్దు దాటడం లేదని.. కానీ మీరే దాటుతూ కయ్యానికి కాలుదువ్వుతున్నారని ఆరోపించారు.