మామిడి పళ్లు ఇవ్వలేదని మర్డర్ చేశాడు..!

ఒడిషాలో దారుణం జరిగింది. మామిడి పళ్లు ఇవ్వలేదని తాగిన మత్తులో కట్టుకున్న భార్యను కడతేర్చాడు ఓ కసాయి భర్త. భద్రాక్ జిల్లాలోని జలముండ గ్రామానికి చెందిన కార్తీక్ జేనా కర్రతో కొట్టి భార్యను చంపాడు

మామిడి పళ్లు ఇవ్వలేదని మర్డర్ చేశాడు..!
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 18, 2020 | 2:38 PM

ఒడిషాలో దారుణం జరిగింది. మామిడి పళ్లు ఇవ్వలేదని తాగిన మత్తులో కట్టుకున్న భార్యను కడతేర్చాడు ఓ కసాయి భర్త. భద్రాక్ జిల్లాలోని జలముండ గ్రామానికి చెందిన కార్తీక్ జేనా ఫుల్లుగా మద్యం సేవించి ఇంటి కొచ్చాడు. తినడానికి మామిడి పళ్లు ఇవ్వమని కార్తీక్ తన భార్యను అడిగాడు. అందుకు అతని భార్య.. పిల్లలు మామిడి పండ్లన్ని తిన్నారని, ఇంట్లో ఇక లేవని చెప్పింది. దీంతో కోపంగా ఊగిపోయిన కార్తీక్.. వెదురు బొంగు కర్రతో ఆమెను విచక్షణారహితంగా చితకబాదాడు. దీంతో ఆమెకు బలమైన గాయాలు కావడంతో అక్కడే కుప్పకూలింది. ఆమె అరుపు విన్న చుట్టుపక్కల వాళ్లు అక్కడి చేరుకునేసరికి అపస్మారక స్థితిలోకి వెళ్లింది ఆ ఇల్లాలు. రక్తమడుగులో ఉన్న ఆమెను స్థానికులు సమీప ధమనగర్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దెబ్బలు బలంగా తాకడంతో ఆమె చనిపోయినట్లు ధృవీకరించారు. స్థానికుల సమాచారం మేరకు కార్తీక్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.