ఐదేళ్లలో మన గౌరవం పెరిగింది : ప్రధాని మోదీ

| Edited By:

Sep 29, 2019 | 5:33 AM

హోస్టన్‌లో జరిగిన హౌడీ మోదీ కార్యక్రమం సక్సెస్ అయ్యిందన్నారు ప్రధాని మోదీ. అమెరికా పర్యటన అనంతరం ఆయన శనివారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఆయనకు విమానాశ్రయంలో బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ గత ఐదేళ్లుగా అమెరికా, ఐక్యరాజ్యసమితికి వెళ్తూనే ఉన్నానని ఈ ఐదేళ్లలో ప్రపంచం దృష్టిలో భారత్ మీద గౌవరం పెరిగిందన్నారు. దీనికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు, 130 కోట్ల మంది ప్రజల ఆశీర్వాదాలే కారణమన్నారు మోదీ. హోస్టన్‌లో […]

ఐదేళ్లలో మన గౌరవం పెరిగింది : ప్రధాని మోదీ
Follow us on

హోస్టన్‌లో జరిగిన హౌడీ మోదీ కార్యక్రమం సక్సెస్ అయ్యిందన్నారు ప్రధాని మోదీ. అమెరికా పర్యటన అనంతరం ఆయన శనివారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఆయనకు విమానాశ్రయంలో బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ గత ఐదేళ్లుగా అమెరికా, ఐక్యరాజ్యసమితికి వెళ్తూనే ఉన్నానని ఈ ఐదేళ్లలో ప్రపంచం దృష్టిలో భారత్ మీద గౌవరం పెరిగిందన్నారు. దీనికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు, 130 కోట్ల మంది ప్రజల ఆశీర్వాదాలే కారణమన్నారు మోదీ. హోస్టన్‌లో జరిగిన హౌడీ మోదీ కార్యక్రమం అఖండ విజయాన్ని సాధించిందని, ఇరు దేశాల మధ్య స్నేహం ఎలా కుదిరిందో ప్రపంచం చూస్తుందన్నారు. దేశ భద్రత విషయంలో సర్జికల్ స్ట్రైక్స్ చేశామని గుర్తుచేశారు. ప్రధాని నరేంద్రమోదీకి స్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు విమానశ్రయానికి తరలివచ్చారు.    శరన్నవ రాత్రులు ప్రారంభం సందర్భంగా శుభాకాంక్షలు  తెలియజేశారు. మరోవైపు మోదీకి స్వాగతం పలికే వారితో రోడ్లన్ని జనసంద్రంగామారాయి.