భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ఆరోగ్య సమస్యతో చెన్నైలోని ఆస్పత్రిలో చేరారు. ఆయన చిన్నపాటి సమస్యతో అపోలో ఆసుపత్రిలో చేరారు. ఈ మేరకు అపోలో ఆసుపత్రి వర్గాలు ఒక ప్రకటన విడుదల చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ అసిడిటీతో బాధపడుతున్నారని, చికిత్స కోసం చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరినట్లు పేర్కొంది. ప్రస్తుతం అతను బాగానే ఉన్నారని, మరో 2-3 గంటల్లో డిశ్చార్జ్ అవుతారని వెల్లడించింది.
అతని ఆరోగ్యానికి సంబంధించిన ప్రకటన కూడా RBI ప్రతినిధి విడుదల చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ అసిడిటీతో బాధపడుతున్నట్లు తెలిపింది. వైద్య పరీక్షల కోసం చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారని చెప్పారు.
ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని ఆర్బీఐ అధికార ప్రతినిధి తెలిపారు. మరో 2-3 గంటల్లో డిశ్చార్జి కానున్నారు. చింతించాల్సిన పనిలేదు. ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పదవీ కాలం కూడా డిసెంబర్ 10తో ముగియనుంది.
ఉర్జిత్ పటేల్ హఠాత్తుగా రాజీనామా చేయడంతో ఆరేళ్ల క్రితం ఆర్‌బీఐ గవర్నర్‌గా శక్తికాంత దాస్ బాధ్యతలు చేపట్టారు. తన పదవీ కాలంలో, కోవిడ్ కారణంగా దేశంలో తలెత్తిన ద్రవ్యోల్బణం సమస్యను నియంత్రించడంలో ఆయన విశేషమైన కృషి చేశారు.
RBI Governor Shaktikanta Das has been admitted to Apollo Hospital in Chennai.
He is fine and nothing concerning. We will issue a formal statement soon: RBI official
(file pic) pic.twitter.com/yOH3605IiO
— ANI (@ANI) November 26, 2024
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..