Sonia House Rent: కొన్నేళ్లుగా ఇంటి రెంట్ చెల్లించని సోనియా గాంధీ.. కీలక వివరాలు వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం..

|

Feb 11, 2022 | 4:13 PM

Sonia House Rent: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తన ఇంటికి అద్దె చెల్లించడంలేదట. ఒకటి కాదు రెండు కాదు.. పదేళ్లుగా ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీసు సహా, సోనియా గాంధీ ఇంటికి..

Sonia House Rent: కొన్నేళ్లుగా ఇంటి రెంట్ చెల్లించని సోనియా గాంధీ.. కీలక వివరాలు వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం..
Follow us on

Sonia House Rent: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తన ఇంటికి అద్దె చెల్లించడంలేదట. ఒకటి కాదు రెండు కాదు.. పదేళ్లుగా ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీసు సహా, సోనియా గాంధీ ఇంటికి అద్దె కట్టడం లేదని వెల్లడించింది కేంద్ర సర్కార్. సెంట్రల్ గవర్నమెంట్ వెల్లడించిన వివరాల ప్రకారం.. కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి భారీగా బాకీ పడింది. దేశ రాజధాని ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి, పార్టీ చీఫ్​సోనియా గాంధీతో సహా పలువురు నాయకులు ఉండే ఇళ్లను సర్కారు నుంచి అద్దెకు తీసుకుని ఉపయోగించుకుంటూ ఏళ్లుగా బకాయి పడ్డారని తెలిపింది కేంద్రం. సమాచార హక్కు కార్యకర్త సుజిత్ పటేల్ దాఖలు చేసిన పిటిషన్‌కు కేంద్రం ఇచ్చిన సమాధానం ద్వారా ఈ విషయం వెల్లడైంది. సుజిత్ పటేల్ అనే కార్యకర్త ఆర్టీఐ ధరఖాస్తు దాఖలు చేయగా.. కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వివరాలు ఇచ్చింది. హౌసింగ్, పట్టణాభివృద్ధి శాఖ నుంచి జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీ కార్యాలయాలకు మూడేళ్ల గడువుతో కిరాయికి భవనాలను వాడుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఆ లోపు ఆయా పార్టీలు వాటికి కేటాయించిన స్థలంలో పార్టీ ఆఫీసులు నిర్మించుకుని, కేంద్రం ఇచ్చిన బిల్డింగ్‌లను ఖాళీ చేయాల్సి ఉంటుంది. కాని అలా తీసుకున్న భవనాలను ఆ గడువు దాటిపోయినా కాంగ్రెస్ పార్టీ.. మళ్లీ మళ్లీ గడువును పొడిగించుకుంటూ వస్తోంది. పైగా ఆ బిల్డింగ్‌ కిరాయి కూడా కట్టడం లేదు.

అక్బర్ రోడ్డులోని కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంపై రూ.12,69,902 అద్దె పెండింగ్‌లో ఉంది. 2012 డిసెంబర్ లో దీనికి చివరిసారిగా అద్దె చెల్లించారు. ఇక జన్‌పథ్‌ రోడ్డులోని సోనియా గాంధీ నివాసానికి సంబంధించి రూ. 4,610 అద్దె పెండింగ్ లోఉంది. 2020 సెప్టెంబర్‌లో సోనియా నివాసానికి చివరగా అద్దె చెల్లించినట్లు కేంద్రం తెలిపింది. అలాగే సోనియా వ్యక్తిగత కార్యదర్శి విన్సెంట్ జార్జ్‌ ఇంటికి 2013లో చివరిసారి అద్దె ఇచ్చారు. చాణక్యపురిలో ఉన్న ఆ బంగ్లాపై రూ. 5,70,911 అద్దె పెండింగ్ ఉన్నట్లు తెలిపింది. ఢిల్లీలో సొంత కార్యాలయం కట్టుకునేందుకు 9ఏ రోజ్ అవెన్యూలో కేంద్ర ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది. 2010 జూన్‌లో నాటి యూపీఏ ప్రభుత్వ హయాంలో కేటాయించిన ఈ స్థలంలో కొత్త బిల్డింగ్‌ను కట్టుకుని.. రూల్ ప్రకారం 2013 నాటికి అక్బర్‌‌ రోడ్డులోని కార్యాలయాన్ని ఖాళీ చేయాలి. అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు అనేక మార్లు గడువు పొడిగింపు చేసుకుంటూ వస్తోంది.

Also read:

Vijay Mallya – Supreme Court: నీకిదే లాస్ట్ ఛాన్స్.. విజయ్ మాల్యాకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. ఎందుకోసమంటే..!

LIC Policy: రోజుకు కేవలం రూ. 262 ఇన్వేస్ట్ చేసి.. రూ. 20 లక్షలు పొందండి..

NIMS Recruitment: నిమ్స్‌ హైదరాబాద్‌లో ప్రొఫెసర్‌ పోస్టులు.. నెలకు రూ. లక్షన్నరకు పైగా జీతం పొందే అవకాశం..