ముఖ్యమంత్రి చేత మాస్క్ తీసేయించిన మహిళ.. కృష్ణగిరి పర్యటనలో ఆసక్తికరమైన పరిణామం..

|

Aug 06, 2021 | 2:30 PM

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ కృష్ణగిరి పర్యటనలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కాన్వాయ్‌లో వెళ్తుండగా సీఎం స్టాలిన్‌ను మాస్క్‌ తీయాలని కోరారు ఓ మహిళ.

ముఖ్యమంత్రి చేత మాస్క్ తీసేయించిన మహిళ..  కృష్ణగిరి పర్యటనలో ఆసక్తికరమైన పరిణామం..
Tamil Nadu Chief Minister M K Stalin
Follow us on


Tamil Nadu chief minister M K Stalin:
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ కృష్ణగిరి పర్యటనలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కాన్వాయ్‌లో వెళ్తుండగా సీఎం స్టాలిన్‌ను మాస్క్‌ తీయాలని కోరారు ఓ మహిళ. ఎప్పడూ మాస్క్‌లోనే ఉంటే..మిమ్మల్ని చూసేదెలా అని ప్రశ్నించారామె. మహిళ అభ్యర్థనతో మాస్క్‌ తీశారు స్టాలిన్‌. ఆ తర్వాత మీ అఖండ విజయం..ఓ సాధారణ మహిళగా నాకు చాలా సంతోషంగా ఉందంటూ స్టాలిన్‌పై ప్రశంసలు కురిపించారామె. ఆ మహిళను హోసూరులోని హడ్కోలోని పాత దేవాలయ ప్రాంతానికి చెందిన రమ్యగా గుర్తించారు.

చెన్నైకి వెళ్లేందుకు స్టాలిన్ బెలకొండపల్లి విమానాశ్రయానికి వెళ్తుండగా చెన్నై-బెంగళూరు జాతీయ రహదారికి ఇరువైపులా వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. కాన్వాయ్ ఉజావార్ షాన్డీకి చేరుకున్నప్పుడు, రమ్య సీఎం కారుకు దగ్గరగా వచ్చి అతని ఫేస్ మాస్క్ తొలగించమని అడిగింది. స్టాలిన్ వెంటనే కారు డ్రైవర్‌ను వాహనాన్ని ఆపమని అడిగాడు. ప్రజాదరణ కలిగిన స్టాలిన్ ముఖం చూడాలన్న అభిమాని కోరికను సీఎం మన్నించారు. వెంటనే తన ఫేస్ మాస్క్‌ను తీసివేశారు. ఎన్నో ఏళ్లుగా దగ్గరగా చూడాలనుకున్నాను. తన కోరిక తీరిందని సంతోషం వ్యక్తం చేసింది రమ్య.

Read Also… కేంద్రానికి వ్యతిరేకంగా విపక్షాల సమరశంఖం.. సాగు చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలకు మద్దతు