Chandra Shekhar Azad : తెల్లదొరల వెన్నులో వణుకు పుట్టించిన చంద్రశేఖర్ అజాద్ 90వ వర్ధంతి..

|

Feb 27, 2021 | 1:24 PM

ఆ పేరు చెప్తే బ్రిటీష్ పాలకుల గుండెల్లో గుబులు పుడుతుంది. ఆ పేరు చెప్తే తెల్లదొరల వెన్నులో వణుకు పుడుతుంది. బ్రిటిషర్ల దాస్య శృంఖ‌లాల నుంచి భరతమాతకు విముక్తి కలిగించడం..

Chandra Shekhar Azad : తెల్లదొరల వెన్నులో వణుకు పుట్టించిన చంద్రశేఖర్ అజాద్ 90వ వర్ధంతి..
Follow us on

chandra shekhar azad death anniversary : ఆ పేరు చెప్తే బ్రిటీష్ పాలకుల గుండెల్లో గుబులు రేగుతుంది. ఆ పేరు వింటే తెల్లదొరల వెన్నులో వణుకు పుడుతుంది. బ్రిటిషర్ల దాస్య శృంఖ‌లాల నుంచి భరతమాతకు విముక్తి కలిగించడం కోసం ఎందరో మహాత్ములు తమ ప్రాణాలను ఫణంగా పెట్టారు. వారిలో ఒకరు చంద్రశేఖర్ అజాద్. నేడు ఆ మహావీరుడి 90వ వర్ధంతి.

మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో పండిత్ సీతారాం తివారికి, అగరాణీదేవికి చంద్రశేఖర అజాద్ జన్మించారు. తమ కొడుకును సంస్కృతంలో పెద్ద పండితుణ్ణి చేయడానికి కాశీలో చదివించాలనుకున్నారు అజాద్ తల్లిదండ్రులు. కాని  అతనికి చదువు పూర్తిగా అబ్బలేదు. చదువుకోడానికి తల్లి తండ్రులు చేసిన ఒత్తిడిని భరించ లేక తన పదమూడవ ఏట ఇల్లొదిలి ముంబయి పారి పోయాడు. ముంబయిలో ఒక మురికి వాడలో నివసించాడు. బ్రతకడానికి కూలి పనిచేశాడు. అనేక కష్టాలు పడ్డాడు.

ఇక్కడ కష్టాల కన్నా సంస్కృతం చదవడమే మేలనిపించి తిరిగి ఇంటికి చేరుకుని 1921లో పాఠశాలలో చేరారు. అదే ఏడాది గాంధీజీ చేపట్టిన సహాయనిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నాడు. మహాత్మా గాంధీ నాయకత్వంలో 1920-21 నాటి అహింసా, సహకారేతర ఉద్యమం యొక్క గొప్ప జాతీయ పురోగతికి  చంద్ర శేఖర్ ఆకర్షితుడయ్యాడు. ఆసమయంలో పోలీసులు అతడిని అరెస్టు చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినప్పుడు అతను తన పేరును ‘ఆజాద్’ అని, అతని తండ్రి పేరు ‘స్వతంత్ర’ మరియు అతని నివాసం ‘జైలు’ అని తెలిపాడు. మేజిస్ట్రేట్ అతనికి 15 కొరడా దెబ్బలు విధించింది. అతని ఒంటి మీద పడిన ప్రతి కొరడా దెబ్బ అతనికి తాను చేయవలసిన పనికి కర్తవ్వ బోధ చేసింది. ఆ విధంగా చంద్రశేఖర్ .. చంద్రశేఖర్ అజాద్ అయ్యాడు.

1925 వరకు ఓ సాధారణ దేశభక్తుడిగా తెలిసినా అదే ఏడాది జరిగిన కకోరీ రైలు దోపిడీతో అజాద్ పేరు దేశమంతా మారుమోగిపోయింది. 1931 ఫిబ్రవరి 27 ఉదయం అలహాబాద్‌లోని అల్‌ఫ్రెడ్ పార్క్‌లో సుఖదేవ్‌తో సమావేశమైనట్లు సమాచారం అందుకున్న పోలీసులు అజాద్‌పై హఠాత్తుగా దాడి చేశారు. వారి నుంచి తప్పించుకోడానికి ప్రయత్నించిన అజాద్‌పై పోలీసులు కాల్పులు జరపడంతో భయపడకుండా వారిని ఎదురించాడు.ఆసమయంలో అతడు వారికి దొరికిపోయానని భావించి తన తుపాకీతో తానే కాల్చుకొని దేశం కోసం ప్రాణాలు అర్పించాడు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Aadhaar-Pan Card: ‘ఆ’ వివరాలలో తప్పులున్నా. ఆధార్‌ను పాన్ కార్డుతో అనుసంధానం చేయవచ్చు..