Cyclone Michaung: వర్షం ఆగినా వదలని వరద ముంపు.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న చెన్నై ప్రజలు..

|

Dec 13, 2023 | 8:28 AM

వర్షం గ్యాప్ ఇచ్చి వారం రోజులు గడుస్తున్నా.. చెన్నైలో తుఫాన్ కష్టం మాత్రం తీరలేదు. ఇప్పటికీ నీటిలోనే చిక్కుకున్నాయి చెన్నై శివారు ప్రాంతాలు. అనేక చోట్ల బోట్ల సాయంతోనే డేటుడే లైఫ్ నడుస్తోంది. సహాయకచర్యలు ముమ్మరం చేసినా.. అరకొరగానే నడుస్తున్నాయి. దీంతో జనంలో అసహనం పెరిగి.. అధికారులపై తిరగబడుతున్నారు.

Cyclone Michaung: వర్షం ఆగినా వదలని వరద ముంపు.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న చెన్నై ప్రజలు..
Cyclone Michaung Effect In Chennai
Follow us on

వర్షం గ్యాప్ ఇచ్చి వారం రోజులు గడుస్తున్నా.. చెన్నైలో తుఫాన్ కష్టం మాత్రం తీరలేదు. ఇప్పటికీ నీటిలోనే చిక్కుకున్నాయి చెన్నై శివారు ప్రాంతాలు. అనేక చోట్ల బోట్ల సాయంతోనే డేటుడే లైఫ్ నడుస్తోంది. సహాయకచర్యలు ముమ్మరం చేసినా.. అరకొరగానే నడుస్తున్నాయి. దీంతో జనంలో అసహనం పెరిగి.. అధికారులపై తిరగబడుతున్నారు.

మిచౌంగ్‌ తుఫాను ప్రభావంతో చెన్నై అతలాకుతలమైంది. ఎడతెరిపిలేని వర్షాలతో సిటీ జనం విలవిల్లాడుతున్నారు. లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. చాలా రోడ్లు నదులను తలపిస్తున్నాయి. కరెంటు లేకపోవడం, రవాణా స్తంభించడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అపార్ట్‌‌మెంట్లలోని పార్కింగ్ ప్లేసులన్నీ నీటితో మునిగిపోయాయి..

మరోవైపు స్కూల్‌కి వెళ్లే పిల్లల పరిస్థితి అంతే దారుణంగా ఉంది. బోట్ల సాయం లేనిదే బయటికెళ్లలేని పరిస్థితి. ఇంటి నుంచి స్కూల్‌ వరకు విద్యార్థులను బోట్లలో తీసుకెళ్తున్నారు. నేడు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రబృందం పర్యటించనుంది. అటు వరద బాధితులకు సహాయంపై సీఎం స్టాలిన్‌ సమీక్ష నిర్వహించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..