కామాఖ్యాదేవికి 20కిలోల బంగారం విరాళమిచ్చిన అంబానీ

| Edited By:

Nov 07, 2020 | 1:54 PM

ఆసియా కుబేరుడు, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ దంపతులు కామాఖ్యదేవి ఆలయానికి భారీ విరాళం ఇచ్చారు. అసోంలోని ఈ ప్రముఖ దేవాలయానికి

కామాఖ్యాదేవికి 20కిలోల బంగారం విరాళమిచ్చిన అంబానీ
Follow us on

Reliance Mukesh Ambani: ఆసియా కుబేరుడు, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ దంపతులు కామాఖ్యదేవి ఆలయానికి భారీ విరాళం ఇచ్చారు. అసోంలోని ఈ ప్రముఖ దేవాలయానికి వారికి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ 20 కిలోల బంగారం విరాళమివ్వగా.. ఆ బంగారాన్ని దేవాలయ మూడు గోపుర కలశాలను తయారుచేయడంలో ఉపయోగించనున్నారు. దీనికి సంబంధించిన పనులు ఇప్పటికే ప్రారంభమైనట్లు ఆలయ పూజారి దీప్ శర్మ వెల్లడించారు. ( నేను పార్టీ మారడం లేదు: రామ సుబ్బారెడ్డి)

సుమారు మూడు నెలల క్రితం ఇందుకోసం అంబానీ కామాఖ్యా ఆలయ నిర్వహణ కమిటీని సంప్రదించినట్లు ఆయన తెలిపారు. మూడు కలశాల బంగారం తాపడం ఖర్చులు తాము భరిస్తామని అప్పుడు ఆలయ అధికారులకు అంబానీ హామీ ఇచ్చారని.. రిలయన్స్‌ ఇంజనీర్లు, శిల్పకారుల ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయని వివరించారు. అన్ని పరిస్థితులు అనుకూలిస్తే దీపావళికి ముందే బంగారం తాపడం పనులు పూర్తయ్యే అవకాశం ఉందని ఈ సందర్భంగా వివరించారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత అంబానీ దంపతులు ఆలయాన్ని సందర్శిస్తారని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. బంగారు తాపడంతో శక్తి పీఠం కొత్త శోభను సంతరించుకుంటుందని శర్మ సంతోషం వ్యక్తం చేశారు. ( హైదరాబాద్‌లో మళ్లీ డబుల్ డెక్కర్‌ బస్సులు వచ్చే అవకాశం..!)