PM Modi: వికసిత్ భారత్ 2047 సంకల్పంతో పనిచేయాలి.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడిన ప్రధాని మోదీ వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఈ సమావేశాల్లో అన్ని అంశాలపై పూర్తిస్థాయి చర్చ జరగాలని.. ప్రతిపక్షాలు చర్చకు సహకరిస్తాయని ఆశిస్తున్నానంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు.

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడిన ప్రధాని మోదీ వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఈ సమావేశాల్లో అన్ని అంశాలపై పూర్తిస్థాయి చర్చ జరగాలని.. ప్రతిపక్షాలు చర్చకు సహకరిస్తాయని ఆశిస్తున్నానంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు. పేదలు, సామాన్యులపై మహాలక్ష్మి కరుణ ఎప్పుడూ ఉండాలన్నారు. లక్ష్మీదేవి మనకు సిద్ధి, బుద్ధిని ప్రసాదిస్తుందన్నారు. మూడోసారి ప్రజలు NDAకి పట్టం కట్టారని.. NDA 3.Oలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని తెలిపారు. ఇన్నోవేషన్, ఇంక్లూషన్, ఇన్వెస్ట్‌మెంట్ ఫార్ములాతో ముందుకెళ్తున్నామని.. తెలిపారు.
ఈ సెషన్‌లో చారిత్రక బిల్లులు ప్రవేశపెడుతున్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ బడ్జెట్ ప్రజల్లో విశ్వాసం నింపుతుంది.. వృద్ధికి ఊతమిస్తుందంటూ పేర్కొన్నారు. బడ్జెట్‌లో యువతకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. వికసిత్ భారత్ 2047 సంకల్పంతో పనిచేయాలి.. ప్రతి సెషన్‌కి ముందు కొన్ని విదేశీశక్తులు కుట్రలు చేయడం చూస్తున్నామంటూ ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తంచేశారు..
VIDEO | PM Modi’s (@narendramodi) remarks at the beginning of the Budget Session of Parliament: “At the beginning of Budget Session today, I bow before Goddess of prosperity – Maa Laxmi. I pray Maa Laxmi to bless the poor and middle-class people of the country.”… pic.twitter.com/BsnDBzYFiL
— Press Trust of India (@PTI_News) January 31, 2025
బడ్జెట్ సెషన్‌లో పలు చారిత్రక బిల్లులపై చర్చిస్తామని ప్రధాని మోదీ తెలిపారు. దేశాన్ని బలోపేతం చేసే చట్టాలను సభలో తయారు చేస్తామన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశ విశ్వాసాన్ని ఈ బడ్జెట్ పెంచుతుందని.. సంస్కరణలు, పనితీరు, పరివర్తనపై తాను దృష్టి సారిస్తానని ప్రధాని మోదీ అన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశ సంకల్పానికి ఈ బడ్జెట్ కొత్త శక్తిని ఇస్తుంది. ప్రజలు మూడోసారి బాధ్యతలు ఇచ్చారని.. మిషన్ మోడ్‌లో దేశ సర్వతోముఖాభివృద్ధిని సాధిస్తామని తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..