G-20 Leaders Meeting: జులై 26 న ప్రారంభం కానున్న జీ-20 వేదిక.. చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే

|

Jul 24, 2023 | 6:53 AM

జీ-20 నాయకుల సమావేశం ప్రారంభానికి సిద్ధమైంది. ఢిల్లీలోని ప్రధాని నరేంద్ర మోదీ జీ-20 దేశాల నాయకులకు ఆతిథ్యం ఇవ్వనున్నారు. ఇందుకోసం నూతనంగా నిర్మించిన ప్రగతి మైదన్ ప్రత్యేక వేదిక కానుంది. ఈ సమావేశం జులై 26న ప్రారంభమవుతుంది.

G-20 Leaders Meeting: జులై 26 న ప్రారంభం కానున్న జీ-20 వేదిక.. చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే
Mice Complex
Follow us on

జీ-20 నాయకుల సమావేశం ప్రారంభానికి సిద్ధమైంది. ఢిల్లీలోని ప్రధాని నరేంద్ర మోదీ జీ-20 దేశాల నాయకులకు ఆతిథ్యం ఇవ్వనున్నారు. ఇందుకోసం నూతనంగా నిర్మించిన ప్రగతి మైదన్ ప్రత్యేక వేదిక కానుంది. ఈ సమావేశం జులై 26న ప్రారంభమవుతుంది. అయితే ఈ ప్రగతిమైదన్‌లో నిర్మించిన వేదికను దాదాపు 123 ఎకరాల్లో అభివృద్ధి చేశారు. ఇండియాలోని అతిపెద్ద మైస్ కేంద్రంగా ఇది రికార్డు నెలకొల్పనుంది. ఇందులో మీటింగ్స్, ఇన్సెంటివ్స్‌, కాన్ఫరెన్సెస్, ఎగ్జిబిషన్స్‌లు నిర్వహించేందుకు వీలు ఉంటుంది.

ఇప్పటిదాకా ఈ కేంద్రంలో కేవలం అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలు నిర్వహించారు. కానీ ఇప్పుడు కేంద్రం ప్రపంచంలోనే టాప్ 10 ఎగ్జిబిషన్, కన్వెన్షన్ కాంప్లెక్స్‌లో ఒకటిగా దీన్ని అభివృద్ధి చేసింది. ఇప్పటి వరకు ఉన్న జర్మనీలోని హన్నోవర్ ఎగ్జిబిషన్ సెంటర్, షాంఘైలోని నేషనల్ ఎగ్జిబిషన్, కన్వేన్షన్ సెంటర్ల వరుసలో ఇది నిలవనుంది. అయితే ఈ కన్వెన్షన్ సెంటర్‌లోన ఉన్న 3వ లెవెల్‌లో దాదాపు 7 వేల మంది కూర్చునేలా సమావేశ మందిరాన్ని ఏర్పాటు చేశాడు. ఇదే ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

ఇవి కూడా చదవండి