కోవిడ్-19 బారిన పడిన తనకు ఎంతో బాగా చికిత్స చేసి పూర్తిగా కోలుకునేలా చూసిన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి డాక్టర్లకు, వైద్య సిబ్బందికి సినీ నటి తమన్నా కృతజ్ఞతలు తెలిపింది. కరోనా వైరస్ పాజిటివ్ కి గురైన తాను చాలా నీరసపడిపోయానని, బలహీనపడ్డానని, ఒక దశలో భయమేసిందని ఆమె తెలిపింది. కానీ మీ అసమాన సేవలతో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలిని చేశారని, ఇందుకు ఎంతో రుణపడి ఉంటానని పేర్కొంది. మీరు చూపిన శ్రధ్ద, ఆప్యాయత మరువలేనివని, మీ సేవలను మాటలలో వర్ణించలేమని తమన్నా వారిని ప్రశసించింది. ఈ నెల 5 న కోవిడ్ కి గురైన తమన్నా వెంటనే హాస్పిటల్ లో అడ్మిట్ అయి ఇటీవలే డిశ్చార్జ్ అయింది. ప్రస్తుతం ఈమె చేతిలో నాలుగైదు సినీ ప్రాజెక్టులున్నాయి.