హెలికాఫ్టర్ లో ‘అనుకోని అతిథి’, ఎలా వచ్చిందో ?

కాలిఫోర్నియాలో రేగిన కార్చిచ్చును ఆర్పడానికి ఓ పైలట్ హెలికాఫ్టర్ తో బయల్దేరాడు. ఆకాశం నుంచి 'హేలీ' ద్వారా కిందకు నీటిని వెదజల్లుతుండగా ఎక్కడినుంచి.. ఎలా వచ్చిందో ఓ గుడ్లగూబ వచ్చి అందులో వాలింది.

హెలికాఫ్టర్ లో 'అనుకోని అతిథి', ఎలా వచ్చిందో ?
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Oct 18, 2020 | 11:19 AM

కాలిఫోర్నియాలో రేగిన కార్చిచ్చును ఆర్పడానికి ఓ పైలట్ హెలికాఫ్టర్ తో బయల్దేరాడు. ఆకాశం నుంచి ‘హేలీ’ ద్వారా కిందకు నీటిని వెదజల్లుతుండగా ఎక్కడినుంచి.. ఎలా వచ్చిందో ఓ గుడ్లగూబ వచ్చి అందులో వాలింది. లోపలికి వచ్చినా.. కాక్ పిట్ చుట్టూ ఎగరకుండా హెలికాఫ్టర్ విండో దగ్గరే కామ్ గా కూర్చుంది. డాన్ అల్వైనర్ అనే ఆ పైలట్ దాన్ని చూసి ఆశ్చర్యపోతూనే.. కింద కార్చిచ్చు తాలూకు మంటలను ఆర్పే క్రమంలో తనపని తాను చేసుకుపోయాడు. కొద్దిసేపయ్యాక ఆ గుడ్లగూబ ఎలా వెళ్లిందో గానీ వెళ్లిపోయిందట. ఇది అరుదైన ఘటన అని స్కై ఏవియేషన్  పేస్ బుక్ లో పేర్కొంది. హెలికాఫ్టర్ లో గుడ్లగూబ ఫోటో మాత్రం వైరల్ అయింది.