ఆ రాష్ట్ర సీఎం సంచలన నిర్ణయం.. నిరుపేదలకు రూ.10కే ధోతి, చీర.!
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తమ రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ అందించారు. పేదల కోసం సరికొత్త పధకాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తమ రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ అందించారు. పేదల కోసం సరికొత్త పధకాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు రూ. 10కే ధోతి లేదా లుంగీ, రూ.10కి చీరను ఏడాదికి రెండుసార్లు అందజేస్తామని ప్రకటించారు. తాజాగా జరిగిన కేబినేట్ సమావేశంలో సీఎం హేమంత్ సోరెన్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. (Saree For Rs 10)
జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోకి వచ్చే రాష్ట్రంలోని అర్హత గల లబ్దిదారులందరికీ, అంత్యోదయ అన్నా యోజన కింద అర్హత సాధించిన కుటుంబాలకు ఆరు నెలల వ్యవధిలో బట్టలు ఇస్తామని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. కాగా హేమంత్ సోరెన్ నాయకత్వంలోని ఝార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ.. ప్రజలకు ధోతీలు, చీరలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విషయం విదితమే.
Also Read: వాళ్లకే తొలి దశ కరోనా వ్యాక్సిన్: కేంద్రం