ప్రపంచ రికార్డు సాధించిన రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్విట్టర్‌ ఖాతా

| Edited By:

Nov 23, 2020 | 3:06 PM

రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా ట్విట్టర్‌ ఖాతా ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ ఖాతాను 10లక్షల మందికి పైగా ఫాలో అవుతుండగా.

ప్రపంచ రికార్డు సాధించిన రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్విట్టర్‌ ఖాతా
Follow us on

RBI Twitter account: రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా ట్విట్టర్‌ ఖాతా ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ ఖాతాను 10లక్షల మందికి పైగా ఫాలో అవుతుండగా.. అత్యధిక ఫాలోవర్లు ఉన్న కేంద్ర బ్యాంక్‌గా నిలిచింది. ప్రముఖ బ్యాంక్‌లు అయిన యూస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌, యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ల కంటే ఆర్బీఐకి ఎక్కువ మంది ఫాలోవర్లు ఉండటం గమనార్హం. ఇక ఆర్బీఐ తరువాత 7.74లక్షల ఫాలోవర్లతో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ మెక్సికో రెండో స్థానంలో ఉండగా.. 7.57లక్షల ఫాలోవర్లతో, బ్యాంక్ ఆఫ్ ఇండోనేషియా మూడో స్థానంలో ఉంది. (పోలీస్ ఇంట విషాదం నింపిన కరోనా.. ఐదు రోజుల వ్యవధిలో ముగ్గురు మృతి)

దీనిపై స్పందించిన ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌.. ఆర్బీఐ ట్విట్టర్‌ ఖాతాకు ఫాలోవర్ల సంఖ్య 10లక్షలను దాటింది. ఇది నిజంగా సరికొత్త మైలురాయి. ఆర్బీఐలోని అందరికీ అభినందనలు అని పేర్కొన్నారు. కాగా 2012 జనవరిలో ఆర్బీఐ అధికారిక ట్విట్టర్ ఖాతాను ప్రారంభించింది.  (‘ఛత్రపతి’ రీమేక్‌.. బెల్లంకొండ కోసం మార్పులు చేస్తోన్న విజయేంద్ర ప్రసాద్‌)