పోలీస్ ఇంట విషాదం నింపిన కరోనా.. ఐదు రోజుల వ్యవధిలో ముగ్గురు మృతి

కరోనా మహమ్మారి ఓ పోలీస్‌ ఇంట విషాదం నింపింది. ఐదు రోజుల వ్యవధిలో పోలీస్‌ ఇంట్లో ముగ్గురు మరణించారు. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది

  • Tv9 Telugu
  • Publish Date - 2:49 pm, Mon, 23 November 20

Corona deaths constable family: కరోనా మహమ్మారి ఓ పోలీస్‌ ఇంట విషాదం నింపింది. ఐదు రోజుల వ్యవధిలో పోలీస్‌ ఇంట్లో ముగ్గురు మరణించారు. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. కానిస్టేబుల్‌గా పనిచేసే ధావల్‌ రావల్‌ ఇంట్లో అతడి తల్లిదండ్రులతో పాటు అతడి సోదరుడికి కూడా కరోనా సోకింది. దీంతో వారు అహ్మదాబాద్‌లో తక్కరానగర్‌లోని‌ ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో.. ధావల్‌ తల్లిదండ్రులను మరో ఆసుపత్రికి మార్చారు. (‘ఛత్రపతి’ రీమేక్‌.. బెల్లంకొండ కోసం మార్పులు చేస్తోన్న విజయేంద్ర ప్రసాద్‌)

ఇక చికిత్స పొందుతుండగా.. ధావల్‌ తల్లి నవంబర్‌ 14న కన్నుమూసింది. ఆ తరువాత రెండు రోజుల వ్యవధిలో తండ్రి కూడా మరణించారు. అనంతరం సోదరుడు కూడా కన్నుమూశారు. ఈ ముగ్గురు ఐదు రోజుల వ్యవధిలోనే మరణించారు. దీంతో ధావల్ ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. (బాలకృష్ణ- బోయపాటి మూవీ.. స్క్రిప్ట్‌లో పలు మార్పులు.. ఆ పాత్రను తీసేస్తున్నారా..!)