రేషన్ కార్డ్ అనేది పేద వర్గాలకు ఆకలి తీర్చడానికి ప్రభుత్వం జారీ చేసే కార్డు. దీని ద్వారా గోధుమలు, బియ్యం, పంచదార మొదలైన నిత్యావసరాలను తక్కువ ధరలకే రేషన్ దుకాణాల ద్వారా ప్రభుత్వం పేద వర్గాలకు పంపిణీ చేస్తుంది. కాగా ఈ విధానంలో రేషన్ పంపిణీపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. రేషన్ డీలర్లు తమ కోటా రేషన్ ఇవ్వడంతో అశ్రద్ద చూపిస్తున్నారని కార్డుదారులు కొన్ని చోట్ల చెబుతున్నారు. మీరు అలాంటి సమస్యను ఎదుర్కొంటుంటే, టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ పోర్టల్ (NFSA) లో ప్రతి రాష్ట్రానికి వేర్వేరు టోల్ ఫ్రీ నంబర్లు ఉన్నాయి. మీరు కానీ రేషన్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటుంటే NFSA వెబ్‌సైట్ https://nfsa.gov.in కు వెళ్ళవచ్చు. ఈ వెబ్‌సైట్‌లోని మెయిల్ లేదా ఫోన్ నంబర్‌ల ద్వారా ఫిర్యాదులు చేయవచ్చు. ప్రతి రాష్ట్రానికి సెపరేట్ టోల్ ఫ్రీ నంబర్ ఉంటుంది.
అవినీతిని తగ్గించడానికి, ఆహార ధాన్యాల పంపిణీని సక్రమంగా నిర్వర్తించడానికి, కేంద్ర ప్రభుత్వం ఫిర్యాదు హెల్ప్‌లైన్ నంబర్లను ప్రవేశపెట్టింది. దీని ద్వారా అర్హులైన పేదలకు సక్రమంగా రేషన్ పంపిణీ చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. పేద ప్రజల కోసం ఆహార ధాన్యాలు పంపిణీ చేయడంలో రేషన్ డీలర్లు సమర్థవంతంగా వ్యవహరించడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది.
Also Read:
Ind vs Eng: క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. స్టార్ ఆల్‌రౌండర్ జడేజా తిరిగి ట్రాక్‌లోకి వచ్చేశాడు
Pollard hits six sixes: పొలార్డ్ ఊచకోత.. 6 బంతుల్లో 6 సిక్సర్లు.. యూవీ, హర్షెల్లే గిబ్స్ సరసన…