కెప్టెన్ మృతికి కన్నీరుపెట్టిన రతన్ టాటా… ముంబై మరణహోమాన్ని గుర్తు చేసుకున్న టాటా.. భావోద్వేగ పోస్ట్….
‘‘మాకు గుర్తుంది’’... ‘‘12 ఏళ్ల కింద జరిగిన మారణ హోమాన్ని మర్చిపోలేదు’’ అని రతన్ టాటా ఇన్ స్టాగ్రాం వేదిక భావోద్వేగపూరితమైన పోస్ట్ పెట్టారు. అందులో ఆయన తాజ్ హోటల్, ముంబైపై ఉగ్రదాడి గురించి రాశారు.
Ratan Tata shared a picture on social media ‘‘మాకు గుర్తుంది’’… ‘‘12 ఏళ్ల కింద జరిగిన మారణ హోమాన్ని మర్చిపోలేదు’’ అని రతన్ టాటా ఇన్ స్టాగ్రాం, ట్విట్టర్ వేదిక భావోద్వేగపూరితమైన పోస్ట్ పెట్టారు. అందులో ఆయన తాజ్ హోటల్, ముంబైపై ఉగ్రదాడి గురించి రాశారు. ఉగ్రదాడి కారణంగా జరిగిన విధ్వంసాన్ని ఎప్పటికీ మర్చిపోమని అన్నారు. ఆ ఆపత్కాలంలో విభిన్న వర్గాలు మారణహోమాన్ని అధిగమించేందుకు ఒక్కటయ్యారని గుర్తు చేసుకున్నారు. ముష్కర దాడిలో అసువులు బాసిన అమరుల త్యాగాలను స్మరించుకుంటామని తెలిపారు.
— Ratan N. Tata (@RNTata2000) November 26, 2020
కెప్టెన్ థామస్ జార్జి కుటుంబసభ్యులకు రుణపడి ఉంటాం…
2008 నవంబర్ 26న తాజ్ హోటళ్లో ఉగ్రదాడి అనంతరం డిసెంబర్ 21న తాజ్ హోటల్ ను తిరిగి ప్రారంభించిన సందర్భంలో సంస్థ ఉద్యోగులతో రతన్ టాటా సమావేశమయ్యారు. ఆ సందర్భంలో ముష్కరుల నుంచి 54 మందిని కాపాడి వీర మరణం పొందిన కెప్టెన్ థామస్ జార్జి మృతిపట్ల ఆయన కన్నీరుపెట్టారని సంస్థ ఉద్యోగులు ఒక సందర్భంలో తెలిపారు. అంతేకాకుండా థామస్ కుటుంబ సభ్యుల రుణాన్ని జన్మలో తీర్చుకోలేమని అన్నట్లు, అలాగే అసువులుబాసిన తాజ్ ఉద్యోగుల కుటుంబాలకు వారి కుటుంబ సభ్యుడు చివరి సారి అందుకున్న జీతాన్ని జీవితాంతం ఇచ్చేందుకు నిర్ణయించారని గుర్తు చేశారు. ఇది రతన్ టాటా దాతృత్వ గుణానికి నిదర్శనమని వారు తెలిపారు. చనిపోయిన ఉద్యోగుల అంత్యక్రియలకు టాటా హాజరవడం ఆయన మానవతా హృదయానికి మచ్చుతునక మాత్రమేనని అన్నారు.