ప్రముఖ పారిశ్రామికవేత్త, మనవతావాది రతన్ టాటా కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. భారత్ మరో కోహినూర్ వజ్రాన్ని కోల్పోయిందంటూ.. రతన్ టాటా మృతి పట్ల ప్రముఖులు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నారు. రతన్ టాటా మృతిపట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. ఇలా రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. రతన్ టాటా మృతి దేశానికి తీరని లోటంటూ పేర్కొంటున్నారు. ఈ క్రమంలో వ్యాపార దిగ్గజం రతన్ టాటా మృతి పట్ల రాష్ట్రీయ స్వయం సేవక్ సంతాపం తెలిపింది.. రతన్ టాటా మృతి భారతీయులందరికీ తీరని లోటంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ డాక్టర్ మోహన్ భగవత్ ప్రకటన విడుదల చేశారు.
देश के सुप्रसिद्ध उद्योगपति श्री रतन टाटा का निधन समस्त भारतवासियों के लिए अत्यंत दुःखद है। उनके निधन से भारत ने एक अमूल्य रत्न को खोया है। भारत की विकास यात्रा में रतन टाटा का योगदान चिरस्मरणीय रहेगा। उद्योग के महत्वपूर्ण क्षेत्रों में नई व प्रभावी पहल के साथ ही कई श्रेष्ठ… pic.twitter.com/NA3TSLGE7r
— RSS (@RSSorg) October 10, 2024
‘‘దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా మృతి భారతీయులందరికీ తీరని లోటు. ఆయన మృతితో భారతదేశం అమూల్యమైన రత్నాన్ని కోల్పోయింది. భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో రతన్ టాటా అందించిన సహకారం చిరస్మరణీయం. కొత్త, సమర్థవంతమైన కార్యక్రమాలతో పాటు, అతను పరిశ్రమలోని ముఖ్యమైన రంగాలలో అనేక ఉత్తమ ప్రమాణాలను నెలకొల్పారు.. సమాజ ప్రయోజనాలకు అనుకూలమైన అన్ని రకాల పనులలో అతని నిరంతర సహకారం, భాగస్వామ్యం కొనసాగింది.. అది జాతీయ ఐక్యత, భద్రత లేదా అభివృద్ధి లేదా పని చేసే ఉద్యోగుల సంక్షేమం.. ఇలా ఏదైనా అంశం కావచ్చు.. రతన్ టాటాజీ తన ప్రత్యేకమైన ఆలోచన, పనితో స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఎన్నో శిఖరాలకు చేరుకున్నప్పటికీ, ఆయన సరళత, వినయం శైలి ఆదర్శప్రాయంగా నిలిచి ఉంటుంది. వారి ఆలోచనలు ఎప్పటికీ ఆదర్శప్రాయమే.. వారి జ్ఞాపకాలు కలకలం నిలిచిఉంటాయి.. రతన్ టాటాకు హృదయపూర్వక నివాళులర్పిస్తున్నాము. ఆ భగవంతుడు రతన్ టాటా ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను’’… అంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రకటనలో తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..