Lalu Prasad Yadav: క్షీణించిన లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఆరోగ్యం.. మళ్లీ ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలింపు..

|

Mar 23, 2022 | 9:43 PM

బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం విషమంగా ఉంది. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంలో మళ్లీ ఢిల్లీ ఎయిమ్స్‌లో చేర్పించారు. ఎమర్జెన్సీ వార్డులో ఉంచి లాలూకు చికిత్స అందిస్తున్నారు. లాలూను..

Lalu Prasad Yadav: క్షీణించిన లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఆరోగ్యం.. మళ్లీ ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలింపు..
Lalu Prasad Yadav
Follow us on

బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav) ఆరోగ్యం విషమంగా ఉంది. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంలో మళ్లీ ఢిల్లీ ఎయిమ్స్‌లో చేర్పించారు. ఎమర్జెన్సీ వార్డులో ఉంచి లాలూకు చికిత్స అందిస్తున్నారు. లాలూను మంగళవారం రాత్రి రాంచీలో రిమ్స్‌ నుంచి ఎయిమ్స్‌కు తరలించారు. బుధవారం తెల్లవారుజామున డిశ్చార్జి చేశారు. అయితే కొన్ని గంటలకే మళ్లీ ఆయన ఆరోగ్యం క్షీణించింది. దీంతో తిరిగి ఎయిమ్స్‌కు తీసుకొచ్చారు. లాలూకు ఇన్ఫెక్షన్‌ లెవెల్‌ పెరిగిపోతోందని ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్‌ చెప్పారు. రిమ్స్‌లో ఉండగా లాలూ ఇన్ఫెక్షన్ లెవెల్‌ 4.5 గా ఉంది. తర్వాత ఢిల్లీలో పరీక్షించినప్పడు 5.1కు పెరిగింది. కాసేపటికి ఇంకా పెరిగి 5.9కు చేరుకుంది. లాలూకు కిడ్నీలు సరిగా పనిచేయడం లేదు.

వాటి సామర్థ్యం 20 శాతానికి పడిపోయిందని వైద్యలు చెప్పారు. లాలూకు షుగర్‌ కూడా బాగా పెరిగిపోయింది. దాణా స్కాం కేసులో ఇటీవలే ప్రత్యేక సీబీఐ కోర్టు లాలూకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.60 లక్షల జరిమానా విధించింది. దీంతో ఆయ‌న‌ను బిర్సా ముండా సెంట్రల్ జైలుకు తరలించారు. అక్కడ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో మొదట రిమ్స్‌కు తీసుకెళ్లారు. తర్వాత ఢిల్లీ తరలించారు. 73 ఏళ్ల లాలూకు దాణా స్కాంలో ఐదు కేసులకు నాలుగు కేసుల్లో శిక్ష పడింది.

ఇవి కూడా చదవండి: Egg Storing Hacks: వేసవిలో గుడ్లు తొందరగా పాడవుతున్నాయా..? ఎక్కువ రోజులు ఎలా నిల్వ చేయాలో తెలుసా..

Coconut Water: వేసవికాలంలో కొబ్బరి నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎంటో తెలుసా..