భారత రక్షణ మంత్రిత్వ శాఖలో సైంటిస్ట్‌గా పనిచేస్తున్న 47 ఏళ్ల దేవేంద్ర బార్లెవార్ శరీరంలో ఇప్పుడు ఐదు మూత్రపిండాలు ఉన్నాయి. కిడ్నీలు చెడిపోతే ఒక్కసారి మాత్రమే డొనర్ దొరకడం పూనర్జన్మ అనుకుంటే.. ఈ బార్లెవార్‌కు ఏకంగా మూడు సార్లు డొనర్లు దొరికారు. అంటే ఈ జన్మలోనే ఆయన మూడు పూనర్జన్మలు పొందారన్న మాట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బార్లెవార్ చాలా కాలంగా సీకేఎడీ(క్రోనిక్ కిడ్నీ డిసీజ్)తో బాధపడుతున్నారు. ఆయనకు రెగ్యులర్‌గా డయాలసిస్ అసవరం అయింది. ఆ తర్వాత ఆయన తొలిసారి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయించకున్నారు. అప్పుడు ఆమె తల్లి అతనికి కిడ్నీని దానం చేశారు. ఆ కిడ్నీ ఓ ఏడాది పాటు పనిచేసింది. ఆ తర్వాత మళ్లీ డయాలసిస్ అవసరం ఏర్పడింది. దీంతో 2012లో ఆయన రెండో సారి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్నారు. రెండో సారి అతని బంధువుల్లో ఒకరు కిడ్నీ దానం చేశార.
2022 వరకు అంటే ఓ పదేళ్ల పాటు ఆ కిడ్నీ బాగా పనిచేసింది. అయితే బార్లెవార్ కోవిడ్ బారిన పడటంతో కరోనా వైరస్ ఆయన కిడ్నీపై ప్రభావం చూపించింది. దీంతో మరోసారి ఆయన కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌కు సిద్ధం అయ్యారు. ఈ సారి కిడ్నీ ఇచ్చేందుకు ఎవరు దొరకలేదు. 2023లో ఓ వ్యక్తి బ్రెయిన్ డెడ్‌తో మరణించడంతో ఆయన కిడ్నీ బార్లెబార్‌కు సరిపోలడంతో ఢిల్లీలోని ఫరీదాబాద్లో గల అమృత హాస్పిటల్ వైద్యులు మూడోసారి కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌కు సిద్ధం అయ్యారు. కానీ, ఈ సారి చాలా రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. బాడీ ఆ ఆర్గాన్‌ను తిరస్కరించడం, లేదా బ్లెడింగ్ వంటి సమస్యలు తలెత్తవచ్చు. పైగా ఇప్పటికే ఆయన బాడీలో నాలుగు కిడ్నీలు ఉండటంతో ఐదో కిడ్నీని ఎక్కడ పెట్టాలనే సవాల్ కూడా వైద్యులకు ఎదురైంది.
అయినా కూడా అమృత హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్, యూరాలజీ డాక్టర్ అనిల్ శర్మ సాహసం చేసిన జనవరి 9 నాలుగు గంటల పాటు శ్రమించి బార్లెవార్‌కు ఆపరేషన్ చేశారు. అదృష్టవశాత్తు ఆపరేషన్ సక్సెస్ అయింది. ఆపరేషన్ తర్వాత 10 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్న బార్లెబార్ తాజాగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా అమర్చిన కిడ్నీ బాగా పనిచేస్తోందని వైద్యులు తెలిపారు. ఈ ఆపరేషన్‌తో తనకు డయాలసిస్ చేయించుకునే బాధ తప్పిందని, తనకు కిడ్నీలు ఇచ్చిన దాతల రుణం తీర్చుకోలేనిదని బార్లెబార్ అన్నారు. ఓ వ్యక్తికి ఒక్కసారి మాత్రమే కిడ్నీ దొరకడం కష్టమైన రోజుల్లో దేవుడి దయవల్ల తనకు మూడు సార్లు దొరికిందని తెలిపారు. ఓ మూడు నెలల విశ్రాంతి తర్వాత బార్లెబార్ తన రోజు వారి పనులు సాధారణంగా చేసుకోవచ్చని వైద్యులు వెల్లడించారు.