Girl Raped by Father: కంటికి రెప్పలా కాపాడాల్సిన వాడే.. ఆ బాలిక పాలిట రాక్షసుడయ్యాడు. అనునిత్యం ఆ బాలిక ఆలనా.. పాలనా చూసుకునే వాడే.. ఆ బంగారు తల్లి జీవితాన్ని నాశనం చేశాడు. అభంశుభం తెలియని 13 బాలికపై కన్నతండ్రే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన తమిళనాడులో ఆలస్యంగా వెలుగుచూసింది. తమిళనాడులోని వెల్లూరు జిల్లాలో గత పది నెలలుగా ఓ కామాంధుడు తన 13 ఏళ్ల కుమార్తెపై.. లైంగిక దాడికి పాల్పడ్డాడు. పదే పదే లైంగిక వేధింపులకు పాల్పడటంతో ఆ బాలిక గర్భం దాల్చి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 44 ఏళ్ల నిందితుడిని అరెస్టు చేసి చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలిక కడుపునొప్పిగా ఉందని చెప్పడంతో ఈ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. బంధువులు ఆమెను వేలూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు తీసుకెళ్లగా.. పరీక్షించిన వైద్యులు ఆమె గర్భిణి అని తెలిపారు. ఈ క్రమంలో మంగళవారం ఆగస్టు 2న బాలిక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటనపై వైద్య బృందం శిశు సంక్షేమ శాఖ అధికారులకు సమాచారం అందించగా, వారు వేలూరు మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అనంతరం పోలీసులు బాలికను ప్రశ్నించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. గత 10 నెలలుగా ఆమె తండ్రి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు పోలీసులకు తెలిపింది. అయితే.. ఆ బాలిక తల్లిదండ్రులు విడిపోయారని.. దీంతో ఆమె, ఆమె సోదరుడు తండ్రి, తాత, నానమ్మతో కలిసి నివసిస్తున్నారు. నానమ్మ వండిన ఆహారాన్ని.. తన తండ్రికి అందించడానికి వెళ్లిన క్రమంలో తనపై లైంగిక దాడికి పాల్పడేవాడని.. ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించేవాడని కన్నీరుమున్నీరైంది. బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అతడిని పోలీసు కస్టడీకి తరలించారు. పోక్సో, పలు సెక్షన్ల కింద కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ ఘటన రాస్ట్రంలో కలకలం రేపింది.
మరికొన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..