సింగర్ మేకప్ .. బాబోయ్ ! ఇదేం బిల్డప్ ?

|

Nov 18, 2019 | 5:52 PM

సింగింగ్ సెన్సేషన్ రణు మండల్ మరో సారి వార్తల్లోకి ఎక్కారు రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాంపై పాటలు పాడుకుంటూ బతుకీడుస్తున్న రణు సడన్ గా సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిన సంగతి తెలిసిందే.. అదే సోషల్ మీడియాకి ఇప్పుడు అడ్డంగా దొరికిపోయింది ఈ ఓవర్ నైట్ స్టార్.. 59 తొమ్మిదేళ్ల రణుమండల్ ఇప్పుడు తన మేకప్‌తో మళ్లీ వైరల్‌ అయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని ఒక బ్యూటీ పార్లర్‌ ప్రారంభోత్సవానికి అతిథిగా వచ్చిన రణు మితిమీరిన మేకప్‌తో ఉండగా తీసిన ఫొటోలు […]

సింగర్ మేకప్ .. బాబోయ్ ! ఇదేం బిల్డప్ ?
Follow us on

సింగింగ్ సెన్సేషన్ రణు మండల్ మరో సారి వార్తల్లోకి ఎక్కారు రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాంపై పాటలు పాడుకుంటూ బతుకీడుస్తున్న రణు సడన్ గా సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిన సంగతి తెలిసిందే.. అదే సోషల్ మీడియాకి ఇప్పుడు అడ్డంగా దొరికిపోయింది ఈ ఓవర్ నైట్ స్టార్.. 59 తొమ్మిదేళ్ల రణుమండల్ ఇప్పుడు తన మేకప్‌తో మళ్లీ వైరల్‌ అయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని ఒక బ్యూటీ పార్లర్‌ ప్రారంభోత్సవానికి అతిథిగా వచ్చిన రణు మితిమీరిన మేకప్‌తో ఉండగా తీసిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా తిరుగుతున్నాయి.

రణు దయ్యంలా ఉందంటూ కొందరు ట్రోలింగ్ చేస్తుంటే, స్కూల్ బోర్డులను తుడిచే డస్టర్ లా ఉందంటూ మరికొందరు జోకులు పేలుస్తున్నారు. కనికరం లేకుండా నెటిజెన్లు రణుపై ఇంతలా విరుచుకపడటానికి కారణం లేకపోలేదు. ఇటీవల ఓ మహిళా అభిమాని సెల్ఫీ కావాలని రణుని అడగగా.. రణు ఆమెతో దురుసుగా ప్రవర్తించారు. ‘ఏయ్ నన్ను ముట్టుకోకు. నేను సెలబ్రిటీని’ అంటూ అహంకారంగా జవాబునిచ్చారు . ఆ వీడియో చూసి… ఒకప్పుడు ముంబై రైల్వే స్టేషన్‌లో భిక్షాటన చేసుకునే రణు మండల్… తన మూలాల్ని మర్చిపోయారా అని నెటిజన్లు నిలదీశారు. స్టార్ డమ్‌ను ఆమె తలకెక్కించుకుంటున్నారని మండిపడ్డారు. ఇంతే కాదు… ఆ తర్వాత జరిగిన ఓ ప్రెస్‌మీట్‌లో ఆమె కాస్త దురుసుగా ప్రవర్తించడం కూడా విమర్శలకు దారితీసింది. మొత్తానికి, ఈ సారి తన చక్కటి స్వరంతో కాకుండా మేకప్ మొహంతో మరోసారి వైరల్ న్యూస్ గా మారింది రణు మండల్.