Lalu Prasad Yadav: దాణా కుంభకోణం కేసులో సంచలన తీర్పు.. లాలూప్రసాద్‌ యాదవ్‌ను దోషిగా తేల్చిన కోర్టు

|

Feb 15, 2022 | 12:46 PM

Lalu Prasad Yadav: దాణా కుంభకోణం కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌తో సహా..

Lalu Prasad Yadav: దాణా కుంభకోణం కేసులో సంచలన తీర్పు.. లాలూప్రసాద్‌ యాదవ్‌ను దోషిగా తేల్చిన కోర్టు
Lalu Prasad Yadav
Follow us on

Lalu Prasad Yadav: దాణా కుంభకోణం కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌తో సహా మొత్తం 110 మంది నిందితులుగా ఉన్నారు. ఈ కుంభకోణం కేసులో లాలూప్రసాద్‌ దోషిగా నిర్ధారించింది రాంచీ సీబీఐ ప్రత్యేక కోర్టు. జనవరి 29న డిఫెన్స్ తరపున వాదనలు పూర్తి చేసిన తర్వాత.. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. మంగళవారం ఈ అతిపెద్ద సంచలనాత్మకమైన దాణా కుంభకోణంపై (Fodder Scam) తీర్పు వెలువరించింది సీబీఐ ప్రత్యేక కోర్టు. ఈ మొత్తం కేసు 1990-1995 మధ్యకాలంలో డోరాండా ట్రెజరీ నుండి రూ. 139.35 కోట్లు రూపాయలు అక్రమంగా విత్‌డ్రా చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇది దాణా కుంభకోణంలో అతిపెద్ద కేసు. ఈ కేసుకు సంబంధించి మొత్తం 575 మంది సాక్షుల వాంగ్మూలాలు తీసుకున్నారు. ఈ కేసులో వాదనలు 7 ఆగస్టు 2021న పూర్తయ్యాయి.

ఈ కేసులో రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసు విచారణ నిమిత్తం లాలూ 24 గంటల ముందే రాంచీ చేరుకున్నారు. 25 ఏళ్ల తర్వాత సీబీఐ కోర్టు ఈ తీర్పును వెలువరించింది. అయితే ఈ దాణా కుంభకోణంలో రూ.950 కోట్ల అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఐదో కేసులోనూ లాలూ దోషిగా తేలారు. 1996లో తొలిసారి దొరండా ట్రెజరీ కేసు నమోదైంది. ఆ సమయంలో 170 మంది నిందితులున్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న  55 మంది ఇప్పటికే మరణించారు. దాణా కుంభకోణంలో దొరండా ట్రెజరీ కేసులో ఐదోవది. లాలూప్రసాద్‌ యాదవ్‌ ప్రభుత్వం పశువుల మేత కోసం నిధులు దుర్వినియోగం చేసినట్ల కేసులు నమోదు అయ్యాయి. దాణా కుంభకోణం కేసులో 14 ఏళ్ల జైలు శిక్ష పడగా, లాలూప్రసాద్‌ యాదవ్‌ ఇప్పటి వరకు 3.5 ఏళ్ల జైలు జీవితాన్ని అనుభవించారు.

ఇవి కూడా చదవండి:

PM Modi: 2014లో యువరాజ్ కారణంగా నా హెలికాప్టర్ ఆగిపోయింది.. రాహుల్ గాంధీపై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు

India Corona: దేశంలో కంట్రోల్‌ లోకి వస్తున్న కరోనా.. గడిచిన 24గంటల్లో గణనీయంగా తగ్గిన పాజిటివ్ కేసులు