Cafe blast Case: క్యాప్‌, మాస్క్‌ లేకుండా బీఎంటీసీ బస్సులో రామేశ్వరం కేఫ్ కేసు అనుమానితుడు

|

Mar 08, 2024 | 7:26 AM

బెంగళూర్‌ రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో పురోగతి సాధించారు ఎన్‌ఐఏ అధికారులు. క్యాప్‌, మాస్క్‌ లేకుండా బీఎంటీసీ బస్సులో కనిపించిన అనుమానితుడి ఫోటోతో పాటు ఊహా చిత్రం ఆధారంగా... బృందాలుగా విడిపోయి బెంగళూరును జల్లెడ పడుతున్నారు. స్థానిక సమాచారం మేరకు అనుమానిత బాంబర్‌ పేలుడు తర్వాత బెంగళూరు నుంచి తుమకూరు వెళ్లి... అక్కడి నుంచి బళ్లారికి పయనమైనట్లు తెలుస్తోంది. తుమకూరు బస్టాండ్‌లో అనుమానితుడి కదలికలను ఎన్‌ఐఏ అధికారులు గుర్తించారు.

Cafe blast Case: క్యాప్‌, మాస్క్‌ లేకుండా బీఎంటీసీ బస్సులో రామేశ్వరం కేఫ్ కేసు అనుమానితుడు
Rameshwaram Cafe Blast
Follow us on

బెంగళూర్‌ రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో పురోగతి సాధించారు ఎన్‌ఐఏ అధికారులు. క్యాప్‌, మాస్క్‌ లేకుండా బీఎంటీసీ బస్సులో కనిపించిన అనుమానితుడి ఫోటోతో పాటు ఊహా చిత్రం ఆధారంగా… బృందాలుగా విడిపోయి బెంగళూరును జల్లెడ పడుతున్నారు. స్థానిక సమాచారం మేరకు అనుమానిత బాంబర్‌ పేలుడు తర్వాత బెంగళూరు నుంచి తుమకూరు వెళ్లి… అక్కడి నుంచి బళ్లారికి పయనమైనట్లు తెలుస్తోంది. తుమకూరు బస్టాండ్‌లో అనుమానితుడి కదలికలను ఎన్‌ఐఏ అధికారులు గుర్తించారు.

అలాగే తుమకూరులోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ టీవీ ఫుటేజ్‌ని సైతం స్వాధీనం చేసుకున్నారు. అనుమానితుడు కోస్తా కర్ణాటకలో ఉంటూ… స్లీపర్‌ సెల్స్‌ మద్దతుతో విదేశాలకు పారిపోయేందుకు ప్రణాళికలు సిద్దం చేసి ఉండొచ్చని ఎన్‌ఐఏ బృందాలు అనుమానిస్తున్నాయి. ఇక మాస్క్‌, క్యాప్‌ లేకుండా ఉన్న అనుమానిత బాంబర్‌ ఫోటోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. అతని ఆచూకీ తెలిపితే 10 లక్షల రివార్డ్‌ ఇస్తామని అధికారులు ఇప్పటికే ప్రకటించారు.

ఇక మార్చి 1న జరిగిన ఈ పేలుడుతో బెంగళూరు ఒక్కసారిగా వణికిపోయింది. ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. రామేశ్వరం కేఫ్‌ను శుక్రవారం తెరవనున్నారు. అయితే అక్కడి నుంచి నిందితుడు సురక్షితంగా పేలుడు జరిపిన రోజున ప్రైవేట్ వాహనంలో కాకుండా బస్సులో ప్రయాణించినట్లు ఎన్‌ఐఏ అధికారులు గుర్తించారు. బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (BMTC) బస్సుల్లో CCTV కెమెరాల ఆధారంగా నిందితుడి కోసం పోలీసు వేట మొదలు పెట్టారు.

500F మార్గంలో (సెంట్రల్ సిల్క్ బోర్డ్ – కడుగోడి) నడిచే BMTC వోల్వో బస్సు (KA-01 F4517)లో ప్రయాణించిన నిందితుడి తాజా ఫుటేజీ బయటపడింది. వీడియోలో, అనుమానితుడు – క్యాప్, ఫుల్ స్లీవ్ షర్ట్, ముదురు ప్యాంటు, ఫేస్ మాస్క్, భుజానికి నల్ల బ్యాక్‌ప్యాక్‌తో అద్దాలు ధరించి – ఉదయం 11:42 గంటలకు ఖాళీగా ఉన్న బస్సులో ఎక్కుతున్నట్లు కనిపించాడు. నిందితుడు గుర్తించకుండా తప్పించుకునేందుకు పలు బస్సుల్లో వేషధారణలు మార్చుకున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు కర్ణాటక హోం మంత్రి జి పరమేశ్వర తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…