Ramdev Baba: మహిళలు బట్టలు లేకున్నా బాగానే ఉంటారు.. తీవ్ర దుమారం రేపుతున్న రాందేవ్ బాబా కామెంట్స్..

యోగా గురువు రామ్ దేవ్ బాబా చిక్కుల్లో ఇరుక్కున్నారు. మహిళల వస్త్రధారణపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవిస్ భార్య అమృతా ఫడణవిస్ ముందే..

Ramdev Baba: మహిళలు బట్టలు లేకున్నా బాగానే ఉంటారు.. తీవ్ర దుమారం రేపుతున్న రాందేవ్ బాబా కామెంట్స్..
Ramdev Baba

Updated on: Nov 26, 2022 | 6:48 AM

యోగా గురువు రామ్ దేవ్ బాబా చిక్కుల్లో ఇరుక్కున్నారు. మహిళల వస్త్రధారణపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవిస్ భార్య అమృతా ఫడణవిస్ ముందే రామ్​దేవ్​బాబా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. థానేలోని పతంజలి యోగా పీఠం, ముంబయి మహిళల పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో యోగా సైన్స్ కార్యక్రమాన్ని నిర్వహించాయి. దీనికి ముఖ్య అతిథిగా అమృతా ఫడణవిస్ హాజరయ్యారు. మహిళలకు ఏర్పాటు చేసిన యోగా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ముగిసిన వెంటనే సమావేశం జరిగింది. వెంట వెంటనే పలు కార్యక్రమాలు నిర్వహించడం వల్ల శిబిరానికి వచ్చిన మహిళలకు డ్రెస్ చేంజ్ చేసుకునే సమయం దొరకలేదు. దీంతో వారి డ్రెస్సింగ్ సెన్స్ పై రాందేవ్ బాబా షాకింగ్ కామెంట్సు చేశారు. మహిళలు చీరలు ధరించేందుకు సమయం లేకపోవడం వల్ల సల్వార్ సూట్స్‌లో బాగుంటారని.. అంతే కాకుండా తన కంటికైతే మహిళలు ఏం ధరించకోపోయినా బాగుంటారని చెప్పడం తీవ్ర దూమారం రేపింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన పలువురు.. రామ్​దేవ్​బాబాపై మండిపడుతున్నాయి.

కాగా.. గతంలోనూ రాందేవ్ బాబా ఇలాంటి కామెంట్లే చేశారు. బాలీవుడ్ అగ్ర నటులు డ్రగ్స్ సేవిస్తున్నారని ఆరోపించారు. బాలీవుడ్‌ ఇండస్ట్రీపై ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలతో మరోసారి బాలీవుడ్ ఉలిక్కిపడింది. ఉత్తర ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో నిర్వహించిన ఆర్యవీర్‌, వీరాంగన సదస్సులో రాందేవ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. యావత్‌ బాలీవుడ్‌ ఇండస్ట్రీ డ్రగ్స్‌ గుప్పిట్లో చిక్కుకుందని, సినిమా పరిశ్రమను డ్రగ్స్‌ చుట్టుముట్టిందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో మద్యం పంపిణీ జరుగుతోందన్న రాందేవ్.. డ్రగ్ అడిక్షన్ నుంచి భారత్‌ను విముక్తి చేసేందుకు మనమంతా కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు.

స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ డ్రగ్స్‌ తీసుకుంటాడని, ఆమీర్‌ ఖాన్‌ డ్రగ్స్‌ తీసుకుంటారా? లేదా? అనేది తనకు తెలియదని రాందేవ్ బాబా చెప్పారు. హీరోయిన్ల డ్రగ్స్ వినియోగం గురించి దేవుడికి మాత్రమే తెలుసునని ఆక్షేపించారు. ఇందుకు సంబంధించిన వీడియో గతంలో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మాదకద్రవ్య వ్యసనం నుండి భారతదేశాన్ని విముక్తి చేసేందుకు తీర్మానం చేయాలన్న రాందేవ్… ఇందుకోసం ఉద్యమం చేపడతామని వార్నింగ్ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం