“పతంజలి” బాలకృష్ణకు అస్వస్థత ఎయిమ్స్‌కు తరలింపు

పతంజలి ఆయుర్వేద సంస్ధ ఛైర్మన్, ప్రముఖ యోగా గురు రామ్‌దేవ్ బాబా మిత్రుడు ఆచార్య బాలకృష్ణ అస్వస్థతకు గురయ్యారు. ఛాతి నొప్పి రావడంతో ఆయనను రిషికేశ్‌లోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అస్వస్థతకు గురికాగానే ఆయనను హరిద్వార్‌లోని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడినుంచి రిషికేశ్‌లో ఎయిమ్స్‌కు తరలించగా ప్రస్తుతం ఐసీయులో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉంటే ఆయన ప్రస్తుతం తన పరిసరాలను గుర్తించలేకపోతున్నారని వైద్యులు చెప్పారు. ఆయనకు పలు వైద్య పరీక్షలు జరుపుతున్నట్టు ఆయనకు చికిత్స అందిస్తున్న […]

  • Tv9 Telugu
  • Publish Date - 2:18 am, Sat, 24 August 19
"పతంజలి"  బాలకృష్ణకు అస్వస్థత ఎయిమ్స్‌కు తరలింపు

పతంజలి ఆయుర్వేద సంస్ధ ఛైర్మన్, ప్రముఖ యోగా గురు రామ్‌దేవ్ బాబా మిత్రుడు ఆచార్య బాలకృష్ణ అస్వస్థతకు గురయ్యారు. ఛాతి నొప్పి రావడంతో ఆయనను రిషికేశ్‌లోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అస్వస్థతకు గురికాగానే ఆయనను హరిద్వార్‌లోని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడినుంచి రిషికేశ్‌లో ఎయిమ్స్‌కు తరలించగా ప్రస్తుతం ఐసీయులో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉంటే ఆయన ప్రస్తుతం తన పరిసరాలను గుర్తించలేకపోతున్నారని వైద్యులు చెప్పారు. ఆయనకు పలు వైద్య పరీక్షలు జరుపుతున్నట్టు ఆయనకు చికిత్స అందిస్తున్న డాక్టర్ బ్రహ్మప్రకాశ్ తెలిపారు. ప్రస్తుతం ఆచార్య బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు.