ఛీ.. ఛీ నువ్వేం తల్లివమ్మా.. ప్రియుడి కోసం ఈమె ఏం చేసిందో తెలిస్తే.. రక్తం మరిగిపోద్ది
ఈ మధ్య కాలంలో కొందరు మహిళలు మరీ దారుణంగా తయారవుతున్నారు. భర్త ఉండగానే వివాహేతర సంబంధాలు పెట్టుకొని రక్త సంబంధాలను తెంచుకుంటున్నారు. అలా వదిలేసినా పర్వాలేదు, కానీ ఏకంగా భూమ్మీదే లేకుండా చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే రాజస్థాన్‌లో వెలుగు చూసింది. ప్రియుడి మోజులో పడిన ఒక వివాహిత తన మూడేళ్ల కుమార్తెను హత్య చేసింది.

ప్రియుడితో జీవనం సాగించడానికి అడ్డంగా ఉందనే కారణంతో ఒక మహిళ తన మూడెళ్ల కుమార్తెనే కడతేర్చిన ఘటన రాజస్థాన్‌లో వెలుగు చూసింది. ఈ ఘటనను మొదట మిస్సింగ్ కేసుగా పరిగణించిన పోలీసులు, సీసీ టీవీ కెమెరాలను పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో తల్లే తన కుమార్తెను హత్య చేసినట్టు గుర్తించిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందిన 28 ఏళ్ల మహిళ కొన్నాళ్ల క్రితం వివాహం జరిగింది. ఈమెకు ప్రస్తుతం మూడేళ్ల కుమార్తె కూడా ఉంది. అయితే కొన్ని రోజుల క్రితం ఈమె తన భర్త నుంచి విడిపోయి రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో అక్కడికే వెళ్లి ఒక ఒక హోటల్‌లో రిసెప్షనిస్ట్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తుంది.
అయితే తన కుమార్తే తమ సంబంధానికి అడ్డుగా ఉందని, ఆమె విషయంతో ప్రియుడి ఆ మహిళతో పదే పదే గొడవ పెట్టుకోవడంతో స్టార్ట్ చేశాడు. దీంతో ఆ మహిళ ఏ తల్లి తీసుకోని నిర్ణయం తీసుకుంది. తన ప్రియుడి కోసం ఏకంగా తన కుమార్తెనే వదిలించుకోవాలని డిసైడ్ అయ్యింది. ఇక ప్లాన్ ప్రకారం రాత్రి సమయంలో చిన్నారిని తీసుకొని నగరంలోని అనా సాగర్ సరస్సు వైపు వెళ్లింది. ఎవరూ చూడట్లేదని గమనించి ఆ చిన్నారిని సరస్సులొ తోసేసింది. దీంతో చిన్నారి నీటమునిగి ప్రాణాలు కోల్పోయింది.
అయితే అదే సమయంలో అటుగా పెట్రోలింగ్ కోసం వచ్చిన ఒక కానిస్టేబుల్ అక్కడున్న మహిళ, ఆమె ప్రియుడిని గమనించాడు. ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నారని వారిని ప్రశ్నించాడు. తాము కూతురితో పాటు బయటకు వచ్చామని.. కానీ మధ్యతో తన కూతురు ఎక్కడో తప్పిపోయిందని ఆమె చెప్పుకొచ్చింది. చిన్నారి కోసం చాలా సేపట్నుంచి వెతుకుతున్నట్టు తెలిపింది. దీంతో స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు.. మొదటి ఆమె బాలికతో పాటు నడుకుంటూ తిరుగుతున్నట్టు గుర్తించారు. కానీ కాసేపటి తర్వాత ఆమె పక్కను బాలిక కనిపించలేదు.
దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆమెను తమదైన స్టైల్‌లో నిలదీయడంతో ఆ మహిళ అసలు విషయాన్ని ఒప్పుకుంది. తన కుమార్తెను తానే సరస్సులో తోసి చంపేసినట్టు నేరాన్ని అంగీకరించింది. దీంతో ఉదయం సరస్సులోంచి బాలిక మృతదేమాన్ని బయటకు తీసిన పోలీసులు పోస్ట్‌మాస్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. తర్వాత నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి రద్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




