స్కూల్‌ భోజనం చేసేందుకు వెళ్తూ కుప్పకూలిన బాలిక.. హాస్పిటల్‌కు తరలించేలోపే..

రాజస్థాన్‌లో తీవ్ర విషాదం వెలుగు చూసింది. స్కూల్‌ భోజనం చేసేందుకు వెళ్తుండగా ఓ తొమ్మిదేళ్ల బాలిక ఒక్కసారిగా కుప్పుకూలిపోయింది. తోటి విద్యార్థుల సమాచారంతో స్కూల్‌ సిబ్బంది బాలినకు హాస్పిటల్‌కు తరలించగా ఆమె గుండెపోటుతో అప్పటికే మరణించినట్టు వైద్యులు నిర్థారించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

స్కూల్‌ భోజనం చేసేందుకు వెళ్తూ కుప్పకూలిన బాలిక.. హాస్పిటల్‌కు తరలించేలోపే..
Rajasthan Tragedy

Updated on: Jul 17, 2025 | 9:58 AM

జులై 17: ఈ మధ్య కాలంలో గుండెపోటుతో చనిపోతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. ఒకప్పుడు 50 ఏళ్లు పైబడిన వారికే వచ్చే ఈ జబ్బు ఈ మధ్య వయస్సుతో సంబంధం లేకుండా పెద్దల నుంచి పిల్లల దాకా అందరి పాలిట మృత్యువుగా మారుతుంది. తాజాగా స్కూల్‌లో భోజనం చేయడానికి వెళ్తుండగా ఓ తొమ్మిదేళ్ల బాలిక గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయి మరణించింది. ఈ విషాద ఘటన రాజస్థాన్‌ లోని దాంతా పట్టణంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. దాంతా పట్టణానికి చెందిన ప్రాచీ కుమావత్‌ అనే తొమ్మిదేళ్ల బాలిక స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు స్కూల్‌లో 4వ తరగతి చదువుతుంది. రోజులాగే బాలిక స్కూల్‌కు వెళ్లింది. ఇక లంచ్‌ టైం కావడంతో పిల్లలతో కలిసి భోజనం చేసేందుకు సిద్ధమైంది. ఇంతలోనే ఒక్కసారిగా అక్కడే పడిపోయింది. గమనించిన తోటి విద్యార్థులు పాఠశాల ఉపాధ్యాయులకు విషయం చెప్పారు. దీంతో వెంటనే ఉపాధ్యాయుడు బాలికను స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. బాలికను పరిక్షించిన వైద్యులు ఆమె పరిస్థితి విషమంగా ఉందని.. మరో హాస్పిటల్‌కు తీసుకెళ్లాలని సూచించారు. దీంతో స్కూల్‌ సిబ్బంది బాలి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.

పరిస్థితి విషమంగా ఉండడంతో మరో హాస్పిటల్‌కు తరలింపు..

ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కలిసి అంబులెన్స్‌ సహాయంతో బాలికను సికార్‌లోని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ బాలినకు పరీక్షించిన వైద్యులు అప్పటికే బాలిక మరణించినట్టు నిర్థారించారు. బాలికలో ఆరోగ్య పరిస్థిని చూస్తే గుండెపోటు కారణంగా మరణించి ఉంటుందని వైద్యలు తల్లిదండ్రులకు వివరించారు. ఈ విషయం విన్న బాలిక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

తమ కూతురికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవంటున్న తల్లిదండ్రులు

ఈ ఘటనపై సదురు పాఠశాల ప్రిన్పిపాల్‌ మాట్లాడుతూ.. అనారోగ్యం కారణంగా బాలిక మూడు రోజుల నుంచి స్కూల్‌కు రాలేదని.. స్కూల్‌కు వచ్చిన తర్వాత బాలిక ఆరోగ్యంగానే ఉన్నట్లు కనిపించిందని ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ ఘటన తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆయన అన్నారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం తమ కుమార్తెకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: ఇంటి ముందు ఆడుకుంటూ కనిపించకుండా పోయిన బాలుడు.. పక్కనున్న నీటి తొట్టిలో చూడగా…

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.