రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌లో హృదయ విదారకఘటన చోటు చేసుకుంది. కరౌలి-ధోల్‌పూర్ హైవే NH-11Bలోని సునిపూర్ గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్లీపర్ కోచ్ బస్సు, ఆటో ఢీకొన్న ఘటనలో 11 మంది మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు, ముగ్గురు బాలికలు, ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. పోలీసులు అందరి మృతదేహాలను బారీ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు.
ఈ దుర్ఘటన బారీ సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జరిగింది. ఆటో రైడర్ బారీ నగరంలోని గుమత్ మొహల్లా నివాసి. అందరూ బరౌలి గ్రామంలో భాత్ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ధోల్‌పూర్ ప్రమాదంలో మృతులను పోలీసులు గుర్తిస్తున్నారు. ధోల్‌పూర్ రోడ్డు ప్రమాదంలో స్లీపర్ బస్సు, ఆటోను ఢీకొన్న ఘటనలో 8 మంది చిన్నారులు సహా 11 మంది మృతి చెందారు. 14 ఏళ్ల అస్మా, 8 ఏళ్ల సల్మాన్, 6 ఏళ్ల సకీర్, 10 ఏళ్ల డానిష్, 5 ఏళ్ల అజాన్, 19 ఏళ్ల అషియానా, 7 ఏళ్ల సుఖి, 9 ఏళ్ల సనీఫ్ మరణించారు. ఇది కాకుండా, ప్రమాదంలో ఇద్దరు మహిళలు, 35 ఏళ్ల జరీనా, 32 ఏళ్ల జూలీ ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 38 ఏళ్ల ఇర్ఫాన్ అలియాస్ బంటీ కూడా ప్రమాదంలో మరణించాడు.
బారీ నగరంలోని కరీం కాలనీకి చెందిన నహ్ను, జహీర్‌ల కుటుంబ సభ్యులు బరౌలి గ్రామంలోని తమ బంధువుల ఇంటికి వెళ్లారని బారీ కొత్వాలీ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి తెలిపారు. భాత్ కార్యక్రమానికి హాజరైన తర్వాత అందరూ తిరిగి వస్తున్నారు. శనివారం(అక్టోబర్ 19) రాత్రి సునీపూర్ గ్రామ సమీపంలో స్లీపర్ బస్సు – ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 11 మంది చనిపోయారు. గాయపడిన వారిలో బస్సు ప్రయాణికులు, డ్రైవర్, కండక్టర్‌లు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. ఆదివారం మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ప్రమాదానికి కారణమైన రెండు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..,.