Udaypur: రాజస్థాన్‌లో కొనసాగుతోన్న హైటెన్షన్‌.. టైలర్‌ కన్హయ్యలాల్‌ మర్డర్‌పై నిరసనలు..

Udaypur Murder: టైలర్‌ హత్యతో రాజస్థాన్‌లో హైటెన్షన్‌ కంటిన్యూ అవుతోంది. స్టేట్‌ వైడ్‌గా భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు.

Udaypur: రాజస్థాన్‌లో కొనసాగుతోన్న హైటెన్షన్‌.. టైలర్‌ కన్హయ్యలాల్‌ మర్డర్‌పై నిరసనలు..
Protest

Updated on: Jul 01, 2022 | 8:42 AM

Udaypur Murder: టైలర్‌ హత్యతో రాజస్థాన్‌లో హైటెన్షన్‌ కంటిన్యూ అవుతోంది. స్టేట్‌ వైడ్‌గా భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. అయితే, ఆంక్షల్ని సైతం లెక్క చేయకుండా పెద్దఎత్తున ఆందోళనలు చేస్తున్నారు ప్రజలు. ఉదయ్‌పూర్‌ టైలర్‌ కన్హయ్యలాల్‌ మర్డర్‌పై నిరసనలు కొనసాగుతున్నాయ్‌. రాజస్థాన్‌లో హిందూ సంఘాలు పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టాయ్‌. ఉదయ్‌పూర్‌లో పోలీస్‌ ఆంక్షలు ఉన్నప్పటికీ అక్కడ కూడా శాంతియుతంగా నిరసన తెలియజేశారు స్థానికులు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేశారు.

టైలర్‌ కన్హయ్య మర్డర్‌పై తొలిసారి స్పందించారు రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌. ఉదయ్‌పూర్ హత్యోదంతం చాలా తీవ్రమైన నేరమన్నారు. హంతుకులిద్దరికీ అంతర్జాతీయ ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్నారు. అయితే, ఇది రెండు వర్గాల మధ్య జరిగిన ఘటన కాదని ప్రజలు గుర్తించాలన్నారు. మర్డర్‌ జరిగిన వెంటనే తమ ప్రభుత్వం వేగంగా స్పందించిందని, అందుకే, నేరస్థులను వెంటనే పట్టుకోగలిగామని అన్నారు. అదే సమయంలో హంతకులకు ఉన్న ఉగ్ర లింకులను వెలికితీశామన్నారు అశోక్‌ గెహ్లాట్‌.

టైలర్‌ కన్హయ్యలాల్‌ మర్డర్‌పై ఎన్‌ఐఏ శరవేగంగా దర్యాప్తు చేస్తోంది. మరోవైపు రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా స్టేట్‌ వైడ్‌గా భద్రతను కట్టుదిట్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..