Rajasthan Cabinet: సచిన్‌ పైలట్‌ వర్గాల మధ్య రాజీ.. రాజస్తాన్ కేబినెట్‌లో 15 మందికి కొత్తగా అవకాశం..

|

Nov 21, 2021 | 9:16 PM

రాజస్థాన్‌లో ఎట్టకేలకు పంతం నెగ్గించుకున్నారు సచిన్‌ పైలట్‌ . అశోక్‌ గెహ్లాట్‌ మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణలో పైలట్‌ వర్గానికి చెందిన ఐదుగురికి మంత్రిపదవులు

Rajasthan Cabinet: సచిన్‌ పైలట్‌ వర్గాల మధ్య రాజీ.. రాజస్తాన్ కేబినెట్‌లో 15 మందికి కొత్తగా అవకాశం..
Rajasthan Cabinet Expansion
Follow us on

Rajasthan Cabinet Expansion: రాజస్థాన్‌లో ఎట్టకేలకు పంతం నెగ్గించుకున్నారు సచిన్‌ పైలట్‌ . అశోక్‌ గెహ్లాట్‌ మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణలో పైలట్‌ వర్గానికి చెందిన ఐదుగురికి మంత్రిపదవులు దక్కాయి. కొత్తగా 15 మంది ప్రమాణం చేశారు. రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో సీఎం అశోక్‌ గెహ్లాట్‌ , సచిన్‌ పైలట్‌ వర్గాల మధ్య రాజీ కుదిరింది. సీఎం గెహ్లాట్‌ తన మంత్రివర్గాన్ని పునర్‌ వ్యవస్థీకరించారు. కేబినెట్‌లో 15 మందికి కొత్తగా అవకాశం కల్పించారు. మొత్తం 30 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. పాతవారిలో ముగ్గురికి మాత్రమే కేబినెట్‌లో స్థానం దక్కలేదు. సచిన్‌ పైలెట్‌ వర్గానికి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కాయి.

2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా కాంగ్రెస్‌ మరోసారి అధికారం లోకి వస్తుందని అన్నారు సీఎం అశోక్‌ గెహ్లాట్‌. కాంగ్రెస్‌ అధిష్టానం తనకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుందని సంతృప్తిని వ్యక్తం చేశారు సచిన్‌ పైలెట్‌. ప్రియాంకాగాంధీ , రాహుల్‌గాంధీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. తన వర్గీయులకు కేబినెట్‌లో చోటు దక్కకపోవడంతో గతంలో అధిష్టానంపై తిరుగుబాటు చేసిన సచిన్‌ పైలెట్‌ ఇప్పుడు మెత్తబడ్డారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు కోసం అందరం కలిసి కృషి చేస్తామని ప్రకటించారు.

సీఎం అశోక్‌ గెహ్లాట్‌ కేబినెట్‌లో కొత్తగా నలుగురు దళిత ఎమ్మెల్యేలకు మంత్రులుగా అవకాశం కల్పించారు. గిరిజననులకు , మహిళలకు కూడా కేబినెట్‌లో ప్రాతినిధ్యం లభించింది. సచిన్ పైలట్ తనకు మద్దతుగా ఉన్న 22 మంది ఎమ్మెల్యేలతో కలిసి అశోక్ గెహ్లోట్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన 16 నెలల తర్వాత క్యాబినెట్ పునర్‌వ్యవస్థీకరణ జరిగింది. పైలట్‌ వర్గానికి చెందిన రమేష్ మీనా, విశ్వేంద్ర సింగ్‌లకు తిరిగి మంత్రి పదవులు పొందారు. వీరితో పాటు బ్రిజేంద్ర సింగ్ ఓలా, మేమారన్ చౌదరి, మురీలాల్ మీనాకు మంత్రి వర్గంలో కొత్తగా చోటు దక్కింది.

మంత్రివదవులు దక్కనివాళ్లు నిరాశకు గురికావదన్నారు సీఎం అశోక్‌ గెహ్లాట్‌ . వాళ్లు కూడా మంత్రులకు తక్కువేమి కాదన్నారు. పార్టీలో ఎలాంటి విబేధాలు లేవని తెలిపారు రాజస్థాన్‌ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జ్‌ అజయ్‌ మాకెన్‌.

ఇవి కూడా చదవండి: CM KCR -Samyukta Kisan Morcha: సీఎం కేసీఆర్ నిర్ణయంపై పెద్ద ఎత్తున ప్రశంసలు.. ఉదారతను అభినందించిన రైతు సంఘాలు..

SBI Alerts: ఇలాంటి కాల్స్ మీకు వస్తున్నాయా.. అయితే జాగ్రత్త.. హెచ్చరించిన బ్యాంక్..

Beware: ఫ్రీజ్‌లో ఆ 8 ఆహార పదార్థాలను ఎప్పుడూ ఉంచవద్దు.. ఎందుకో తెలిస్తే షాకే..