Delhi Rains: దేశ రాజధానిలో 122 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన వర్షం.. గత 24 గంటల్లో 19.7 మిల్లీమీటర్ల వర్షం

|

Jan 24, 2022 | 8:47 AM

Delhi Rains: దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఏడాది జనవరిలో ఇప్పటివరకు 88.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇది 1901 తర్వాత అత్యధిక వర్షపాతం.

Delhi Rains: దేశ రాజధానిలో 122 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన వర్షం.. గత 24 గంటల్లో 19.7 మిల్లీమీటర్ల వర్షం
Rainfall
Follow us on

Delhi Rains: దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఏడాది జనవరిలో ఇప్పటివరకు 88.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇది 1901 తర్వాత అత్యధిక వర్షపాతం. భారత వాతావరణ శాఖ ఈ సమాచారాన్ని వెల్లడించింది. IMD డేటా ప్రకారం.. దీనికి ముందు ఢిల్లీలో 1989 సంవత్సరంలో 79.7 మిమీ, 1953 లో 73.7 మిమీ వర్షం కురిసింది. సఫ్దర్‌జంగ్ అబ్జర్వేటరీలో గత 6 రోజులుగా రికార్డు వర్షం నమోదైంది. ఈ నెలలో ఇప్పటివరకు 88.2 మిమీ వర్షం నమోదైంది. అంతేకాదు ఆదివారం రాత్రి 8.30 గంటల వరకు రికార్డు స్థాయిలో 19.7 మి.మీ వర్షం కురిసింది.

వాస్తవానికి IMD వెబ్‌సైట్ ప్రకారం.. ఈ నెలలో పాలెం అబ్జర్వేటరీలో 110 మిమీ వర్షం నమోదైంది. ఆదివారం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 10.5 డిగ్రీల సెల్సియస్. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఇదే అత్యల్ప గరిష్ట ఉష్ణోగ్రత. అదే సమయంలో సఫ్దర్‌జంగ్ అబ్జర్వేటరీలో శనివారం ఉదయం 8 గంటల వరకు ఐదు మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. ఈ సమయంలో కనిష్ట ఉష్ణోగ్రత 11.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది సగటు కంటే 4 డిగ్రీలు ఎక్కువని వాతావరణ శాఖ తెలిపింది.

ఢిల్లీ NCR లోని అనేక ప్రాంతాల్లో కొనసాగుతున్న వర్షం

భారత వాతావరణ శాఖ ప్రకారం.. ఢిల్లీ, ఘజియాబాద్, ఇంద్రపురం, నోయిడా, దాద్రీ, గ్రేటర్ నోయిడా, గురుగ్రామ్, ఫరీదాబాద్, మనేసర్, వల్లభఘర్‌లలో వర్షం ఇంకా కొనసాగుతోంది. IMD ప్రకారం.. దేశంలోని వాయువ్య, మధ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. జమ్మూ, కాశ్మీర్, ఉత్తరాఖండ్‌తో సహా దేశంలోని ఇతర పర్వత ప్రాంతాలలో కూడా హిమపాతం కనిపిస్తుంది. IMD ప్రకారం.. వెస్ట్రన్ డిస్ట్రబెన్స్ కారణంగా ఆకాశం మేఘావృతమై ఉంటుంది తేలికపాటి వర్షం పడే అవకాశం ఉంది.

చల్లని ఇబ్బంది

రానున్న రోజుల్లో చలి మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. అయితే జనవరి 24, 25 తేదీల్లో చలితో పాటు దట్టమైన పొగమంచు కూడా కమ్మేస్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది. జనవరి 26 నుంచి కోల్డ్ వేవ్ అలర్ట్ కూడా జారీ చేశారు. చంబా, లాహౌల్-స్పితి, కులు, కిన్నౌర్, సిమ్లా, మండిలోని ఎత్తైన శిఖరాలపై మంచు కురిసే అవకాశం ఉందని మధ్య, దిగువ ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది.

Post Office: పోస్టాఫీసు ఈ ఖాతా గురించి మీకు తెలుసా..? ప్రతి పైసా సురక్షితం..

Sleep Mistakes: మీరు బాగా నిద్రపోవాలంటే పొరపాటున కూడా ఈ తప్పులు చేయొద్దు..?

Rose Flower Farming: గులాబీల సాగుతో రైతుల ఆదాయం మెరుగు.. చిన్న పట్టణాల్లో కూడా మంచి లభాలు..