
సికింద్రాబాద్, 06 మార్చి 2025: హోలీ పండుగ సందర్భంగా ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా రైల్వే శాఖ వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇప్పటికే ప్రకటించిన ప్రత్యేక రైళ్లకు అదనంగా ఇప్పుడు మరో 22 హోలీ ప్రత్యేక రైళ్లను (Holi Special Trains) ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలుతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల ప్రయాణీకులకు లబ్ధి చేకూరేలా రైల్వే శాఖ ఈ ప్రత్యేక రైళ్లను నడపనుంది. మార్చి 7 తేదీ నుంచి 18వ తేదీకి మధ్య ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ ప్రత్యేక రైళ్లు తిరుప్పూర్, ఈరోడ్, సేలం, జోలార్‌పేటై, కాట్పాడి, పెరంబూరు, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, దువ్వాడ, విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, రాయగడ, మునిగూడ, టిట్లాగఢ్, సంబల్పూర్, ఝార్సుగూడ, రూర్కెలా, నువాగావ్, హతియా, రాంచీ, మురి, బొకారో స్టీల్ సిటీ, ధన్‌బాద్, బరాకర్, చిత్తరంజన్, మధుపూర్, జసిదిహ్, ఝా, కియుల్ స్టేషన్లలో రెండు దిశలలో ఆగుతాయి.
ఈ ప్రత్యేక రైళ్లు కొల్లం, కాయంకుళం, చెంగన్నూర్, తిరువల్ల, కొట్టాయం, ఎర్నాకుళం టౌన్, అలువా, త్రిస్సూర్, పాల్ఘాట్, పోదనూర్, తిరుప్పూర్, ఈరోడ్, సేలం, జోలార్‌పేటై, కాట్పాడి, చిత్తూరు, తిరుపతి, రేణిగుంట, గూడూరు, నెల్లూరు, విజయవాడ, వరంగల్, బల్హర్షా, నాగ్‌పూర్, రాణి కమలాపతి, బినా, ఝాన్సీ, గ్వాలియర్, ఆగ్రా కాంట్, మధుర స్టేషన్లలో రెండు దిశలలో ఆగుతాయి.
ఈ ప్రత్యేక రైళ్లు గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలేశ్వర్, ఖరగ్‌పూర్ స్టేషన్లలో రెండు దిశలలో ఆగుతాయి.
అలాగే చర్లపల్లి – ధనపూర్, చర్లపల్లి – ముజఫర్‌పూర్ మధ్య హోలీ సందర్భంగా 10 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ద.మ. రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
ప్రత్యేక రైళ్ల వివరాలు
SCR PR No. 920 on “10 Holi Special Trains between Charlapalli – Danapur & Charlapalli – Muzaffarpur”@drmsecunderabad #Holi pic.twitter.com/0qOK9dUb1L
— South Central Railway (@SCRailwayIndia) March 6, 2025