శరవేగంగా రైల్వే ట్రాక్‌ పునరుద్ధరణ పనులు.. డౌన్‌ మెయిల్‌ లైన్‌ పనులు పూర్తయినట్లు ప్రకటించిన మంత్రి

ఒడిశా బాలేశ్వర్‌లో జరిగిన రైలు ప్రమాద స్థలంలో అధికారులు రైల్వే ట్రాక్‌ పునరుద్ధరణ పనులను శరవేగంగా నిర్వహిస్తున్నారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ సంఘటన స్థలంలోనే ఉంటూ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులను యుద్ధ ప్రాతిపదికన కొనసాగిస్తున్నారు. దాదాపు 1,000 మంది రైల్వే కార్మికులు, అధికారులు..

శరవేగంగా రైల్వే ట్రాక్‌ పునరుద్ధరణ పనులు.. డౌన్‌ మెయిల్‌ లైన్‌ పనులు పూర్తయినట్లు ప్రకటించిన మంత్రి
Ashwini Vaishnaw

Updated on: Jun 04, 2023 | 8:23 PM

Odisha Train Accident: ఒడిశా బాలేశ్వర్‌లో జరిగిన రైలు ప్రమాద స్థలంలో అధికారులు రైల్వే ట్రాక్‌ పునరుద్ధరణ పనులను శరవేగంగా నిర్వహిస్తున్నారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ సంఘటన స్థలంలోనే ఉంటూ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులను యుద్ధ ప్రాతిపదికన కొనసాగిస్తున్నారు. దాదాపు 1,000 మంది రైల్వే కార్మికులు, అధికారులు, సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ట్రాక్‌ పునరుద్ధరణలో భాగంగా ఏడు పాకెటింగ్ యంత్రాలు, భారీ రైల్వే క్రేన్‌, నాలుగు రోడ్‌ క్రేన్లను ఉపయోగిస్తున్నారు.

ఇందులో భాగంగానే ఆదివారం మధ్యాహ్నం 12.05 గంటల నాటికి డౌన్​ మెయిల్ లైన్​ను పునరుద్ధరించారు. ఈ విషయాన్ని రైల్వే మంత్రి ఈ విషయాన్ని ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు. ఇదిలా ఉంటే ప్రమాదం జరిగిన శుక్రవారం సాయంత్రం నాటికి సహాయక చర్యలు పూర్తి కావడం వల్ల వెంటనే ట్రాక్ పునరుద్ధరణ పనులను అధికారులు చేపట్టారు. శనివారం రాత్రి భారీ జనరేటర్లు, పెద్ద లైట్లను ఉపయోగించి ట్రాక్‌ లింకింగ్‌ పనులు చేశారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే ట్రాక్‌ మరమ్మతు పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని మంత్రికి ప్రధాని మోడీ సూచించారు. కాగా ఒడిశా రైలు ప్రమాద ఘటనపై శనివరాం దేశ రాజధాని ఢిల్లీలో అత్యవసర సమావేశం నిర్వహించారు ప్రధాని మోదీ. అనంతరం ఒడిశాకు వెళ్లి ప్రమాద స్థలిని పరిశీలించారు. అనంతరం ఒడిశాలోని కటక్‌ ఆస్పత్రికి వెళ్లి ప్రమాద ఘటనలో గాయపడిన క్షతగాత్రులను పరామర్శించారు. అండగా ఉంటామంటూ భరోసా నిచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..