స్టాక్ మార్కెట్లకు దూరంగా ఉండాలంటూ కాంగ్రెస్ అగ్ర నాయకుడు, లోక్‌సభ్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ముఖ్యంగా ఆయన యువతకు ఈ సూచన చేశారు. దేశంలో 1 శాతం జనాభా మాత్రమే స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతోందని, స్టాక్ మార్కెట్ల నుంచి డబ్బులు సంపాదించడం అనేది ఒక భ్రమ అంటూ రాహుల్ పేర్కొన్నారు. ట్రంప్ సుంకాలు విధించిన తరువాత భారత ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని రాహుల్ గాంధీ అన్నారు. బిహార్ లోని బెగూసరాయ్‌లో జరిగిన సభలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌పై సుంకాలు విధించిన తరువాత స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయన్నారు. దేశంలో ఒక శాతం జనాభా మాత్రమే స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారని, స్టాక్ మార్కెట్ల నుంచి డబ్బులు సంపాదించాలని అనుకోవడం భ్రమే అవుతుందన్నారు రాహుల్. అయితే ఈ డిజిటల్ యుగంలో చాలా మంది సులభంగా స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టిన నష్టపోతున్నారు. కొంతమంది నష్టాలను భరించలేక ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.