Rahul Gandhi: కేంద్ర ప్రభుత్వం అడుగుజాడల్లోనే.. సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు.. రాహుల్ గాంధీ ఫైర్

|

Mar 04, 2021 | 2:01 PM

Rahul Gandhi on Centre: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రైతుల నిరసనలకు మద్దతు తెలుపుతున్న వారిని అణిచి వేసేందుకు..

Rahul Gandhi: కేంద్ర ప్రభుత్వం అడుగుజాడల్లోనే.. సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు.. రాహుల్ గాంధీ ఫైర్
Follow us on

Rahul Gandhi on Centre: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రైతుల నిరసనలకు మద్దతు తెలుపుతున్న వారిని అణిచి వేసేందుకు మోదీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్ధలను దుర్వినియోగం చేస్తోందని రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, రైతులకు మద్దతుగా గళమెత్తుతున్న వారిపై దాడులు చేయిస్తూ కేంద్ర దర్యాప్తు సంస్ధలను మోదీ ప్రభుత్వం కనుసన్నల్లో నడిపిస్తోందని విమర్శించారు. ఐటీ, ఈడీ, సీబీఐలను మోదీ ప్రభుత్వం ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా శాసిస్తోందని అంటూ.. ఎద్దేవా చేస్తూ రాహుల్‌ ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా #ModiRaidsProFarmers అనే హ్యాష్‌ట్యాగ్‌ను జతచేశారు.

ముంబైలో బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌, హీరోయిన్ తాప్సీ పన్ను ఇళ్లపై బుధవారం ఐటీ దాడులు జరిగిన నేపథ్యంలో రాహుల్‌ ట్విట్టర్ వేదికగా మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కశ్యప్‌, తాప్సీలు గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే ఐటీ దాడులు నిర్వహించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కాగా.. అనురాగ్‌ కశ్యప్‌, తాప్సీ ఇళ్లపై ఐటీ దాడులను ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ సైతం తప్పుపట్టారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్న వారిపై దాడులు చేయిస్తున్నారంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తచేశారు.

ఐటీ దాడుల అనంతరం కశ్యప్, తాప్సీ ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు పలు కీలక ఆధారాలకు సంబంధించిన హార్డ్ కాపీలను కూడా స్వాధీనం చేసుకున్నారు.

Also Read:

పంజాబీ రాఫెల్ విమానం ఎక్కి చూద్దామా ? ఎగరలేని ఫ్లైట్ లో సరదాగా షికారు చేద్దామా ?

Crime: యూపీలో మరో ఘోరం.. కుమార్తె తల నరికి.. చేతిలో పట్టుకొని.. గ్రామంలో తిరిగిన తండ్రి..