Rahul Gandhi: తెలంగాణ వంటకాలు చాలా స్పైసీ గురూ.. భారత్‌ జోడో యాత్ర అనుభవాలను పంచుకున్న రాహుల్‌ గాంధీ

|

Jan 23, 2023 | 6:20 AM

రాహుల్‌  తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.  ముఖ్యంగా ఆయనకు ఇష్టమైన ఆహారం, దుస్తులు, ఫేవరెట్‌ టూరిస్ట్‌ ప్లేసుల గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు.

Rahul Gandhi: తెలంగాణ వంటకాలు చాలా స్పైసీ గురూ.. భారత్‌ జోడో యాత్ర అనుభవాలను పంచుకున్న రాహుల్‌ గాంధీ
Rahul Gandhi
Follow us on

కాంగ్రెస్‌ నేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. కన్యాకుమారి నుంచి మొదలైన ఈ యాత్ర ఇప్పుడు కశ్మీర్‌దాకా చేరుకుంది. కాగా రోజులు సాగుతున్న కొద్దీ ఆయన మరింత యాక్టివ్‌గా మారిపోతున్నారు. ఎండ, వర్షం, చలిని ఏ మాత్రం లెక్కచేయకుండా ముందుకు సాగుతున్నారు. ఎక్కువగా టీషర్ట్‌తోనే కనిపిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీకి సంబంధించిన ఓ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో రాజకీయ అంశాలతో పాటు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు రాహుల్‌ .  ముఖ్యంగా ఆయనకు ఇష్టమైన ఆహారం, దుస్తులు, ఫేవరెట్‌ టూరిస్ట్‌ ప్లేసుల గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు. అలాగే భారత్ జోడో యాత్రలో భాగంగా వివిధ ప్రాంతాల్లో తనకు ఎదురైన అనుభవాలను కూడా పంచుకున్నారు.

ఆహారం విషయంలో రాహుల్ గాంధీకి ప్రత్యేక ప్రాధాన్యతంటూ ఏమీలేదు. అంటే ఇదే తినాలని పట్టుబట్టరు. అయితే బఠానీలు, జాక్‌ఫ్రూట్ అంటే పెద్దగా ఇష్టం ఉండదు. ఇక భారత్ జోడో యాత్రలో భాగంగా ఆయా ప్రాంతాలకు సంబంధించిన లోకల్‌ ఫుడ్స్‌నే ఎక్కువగా ఆస్వాదించారట. ఇటీవల మహారాష్ట్రలో కూడా భక్రిని ఇష్టపడి తిన్నారట. అయితే తెలంగాణ రుచులను ఆస్వాదిస్తున్నప్పుడు మాత్రం చాలా స్పైసీగా అనిపించాయట. అయితే టేస్ట్‌లో మాత్రం అదిరిపోయాయట. రాహుల్ గాంధీ ఇంట్లో మధ్యాహ్న భోజనానికి సాధారణంగా దేశీ వంటకాలకే ప్రాధాన్యమిస్తారు. ఇక డిన్నర్‌లో మాత్రం ఎక్కువగా ఫారిన్‌ డిషెస్‌, కాంటినెంటల్‌ ఫుడ్‌కు ప్రాధాన్యమిస్తారట. అయితే ఏ ఫుడ్‌ తీసుకున్నా కంట్రోల్ డైట్ తప్పకుండా పాటిస్తారట. అందుకే రాహుల్‌ గాంధీ మెనూ లిస్ట్‌ కాస్త బోరింగ్‌గా ఉంటుందని చాలామంది అంటుంటారు. ఇక నాన్ వెజ్‌లో చికెన్, మటన్, సీ ఫుడ్ తినడమంటే రాహుల్ గాంధీకి ఇష్టం. డైట్‌ కంట్రోల్‌ కారణంగా స్వీట్లు తినరు. అయితే ఐస్‌క్రీం అంటే చాలా ఇష్టం.చాక్లెట్, స్ట్రాబెర్రీ ఫ్లేవర్లను బాగా ఇష్టపడతారు. ఇక రాహుల్ గాంధీకి ఇష్టమైన వంటకాలు చికెన్ టిక్కా, సీక్ కబాబ్. అలాగే ఆమ్లెట్ తినడానికి చాలా ఇష్టపడతారు. ఇక ఢిల్లీలో మోతీ మహల్, సాగర్, స్వాగత్, శరవణ భవన్ ఆయనకు ఇష్టమైన రెస్టారెంట్లు. ఇక డైవింగ్, మార్షల్ ఆర్ట్స్ అంటే రాహుల్‌కు చాలా ఇష్టమట. అలాగే ఒంటరిగా ప్రయాణించడం, బ్యాక్‌ప్యాక్ ట్రావెల్ చేయడానికి కూడా ఆసక్తి చూపిస్తారట.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..