కోవిడ్ రోగుల కోసం, ‘హలో డాక్టర్’ మెడికల్ హెల్ప్ లైన్ లాంచ్ చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ

| Edited By: Anil kumar poka

May 01, 2021 | 1:54 PM

దేశంలో కోవిడ్ రోగులకు సాయపడేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శనివారం మెడికల్ అడ్వైజరీ హెల్ప్ లైన్ ని లాంచ్ చేశారు. 'హలో డాక్టర్' పేరిట గల ఈ మెడికల్ అడ్వైజరీ....

కోవిడ్ రోగుల కోసం, హలో  డాక్టర్ మెడికల్ హెల్ప్ లైన్ లాంచ్ చేసిన కాంగ్రెస్  నేత రాహుల్ గాంధీ
keep all political work aside
Follow us on

దేశంలో కోవిడ్ రోగులకు సాయపడేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శనివారం మెడికల్ అడ్వైజరీ హెల్ప్ లైన్ ని లాంచ్ చేశారు. ‘హలో డాక్టర్’ పేరిట గల ఈ మెడికల్ అడ్వైజరీ హెల్ప్ లైన్ నెంబర్ ’91 998386838′ అని ఆయన తన ట్వీట్ లో వివరించారు. కోవిద్ పై పోరులో డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది సహకరించి వైద్య సలహాలు అవసరమైనవారికి తోడ్పడాలని ఆయన కోరారు. దేశం ఇప్పుడు 4 లక్షల కోవిడ్ కేసులతో అల్లాడుతోందని, మూడున్నరవేలమంది 24 గంటల్లో మరణించారని, 32 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయని రాహుల్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈ మహమ్మారి విజృంభించిన ఈ తరుణంలో డాక్టర్లు, వైద్య సిబ్బంది నుంచి రోగులు చికిత్సను, సలహాలను, వారి ఆప్యాయతను కూడా కోరుతున్నారని ఆయన అన్నారు. రోగులను సంప్రదించేందుకు ఈ ‘హలొ డాక్టర్’ హెల్ప్ లైన్ లో వారు తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలని ఆయన సూచించారు . వారు తమ రాష్ట్రాలు, టైం స్లాట్లను, తమకు వీలైన తేదీలు, సమయాలను దీనిద్వారా పేర్కొనవచ్చునని రాహుల్ అన్నారు.

తమ పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ తరుణంలో రాజకీయాలను పక్కన బెట్టి కోవిడ్ రోగులకు, వారి బంధువులకు సాయపడాలని, వారిని ఆదుకోవాలని రాహుల్ ఇదివరకే పిలుపునిచ్చారు. కరోనా వైరస్ పాజిటివ్ కి గురైన రాహుల్ ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. తమ హెల్ప్ లైన్ డాక్టర్లకు, రోగులకు అనుసంధాన కర్తగా పని చేస్తుందని ఆయన వివరించారు. రోగులు కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలన్నారు. కోవిద్ బాధితులను ఆదుకోవడానికి చేసే ఏ చిన్న సహాయమైనా అది గొప్ప ఆశాకిరణమవుతుందని రాహుల్ కూడా వ్యాఖ్యానించారు.