Rahul Gandhi: నాకు ఎలాంటి అయోమయం లేదు.. ఆ విషయంలో కుండబద్దలు కొట్టిన రాహుల్‌ గాంధీ

Rahul Gandhi: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవి రేసులో నుంచి తాను పూర్తిగా తప్పుకోలేదనే సంకేతాలు ఇచ్చారు రాహుల్‌గాంధీ. తాను కాంగ్రెస్‌కు అధ్యక్షుడిని అవుతానా లేదా..

Rahul Gandhi: నాకు ఎలాంటి అయోమయం లేదు.. ఆ విషయంలో కుండబద్దలు కొట్టిన రాహుల్‌ గాంధీ
Rahul Gandhi

Updated on: Sep 10, 2022 | 7:45 AM

Rahul Gandhi: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవి రేసులో నుంచి తాను పూర్తిగా తప్పుకోలేదనే సంకేతాలు ఇచ్చారు రాహుల్‌గాంధీ. తాను కాంగ్రెస్‌కు అధ్యక్షుడిని అవుతానా లేదా అన్నది పార్టీ ఎన్నికలు వచ్చినపుడు తేలుతుందని భారత్‌జోడో యాత్రలో భాగంగా తమిళనాడులోని పులియూర్‌ కురుచ్చిలో చెప్పారు. తాను ఏం చేయాలన్నది నిర్ణయించుకున్నాననీ, తనకు ఎలాంటి అయోమయం లేదని రాహుల్‌గాంధీ కుండబద్దలు కొట్టారు.

దేశంలోని క్షేత్రస్థాయిలో పరిణామాల్ని తెలుసుసుకునేందుకు పాదయాత్ర ఓ మంచి ప్రయాణమన్నారు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు చేసిన విధ్వంసం నుంచి దేశాన్ని కాపాడేందుకు ఇదో ప్రయత్నమన్నారు. ప్రజల్ని కలిసేందుకు, కలిపి ఉంచేందుకే ఈ యాత్ర చేపట్టానన్న రాహుల్‌.. దేశాన్ని విభజించేలా ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగానే తన పోరాటమన్నారు. ఈ యాత్రకు నాయకత్వం వహించడం లేదన్న రాహుల్‌.. సామాన్య కార్యకర్తగానే పాల్గొంటున్నానని చెప్పారు. కాంగ్రెస్‌ భావజాలం నచ్చేవాళ్లంతా ఇందులో పాల్గొనవచ్చన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి