రాహుల్ వ్యాఖ్యలపై మహిళా ఎంపీల ఆగ్రహం.. క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్

శుక్రవారం లోక్‌సభ అట్టుడికిపోయింది. ఇటీవల జరిగిన వరుస హత్యాచార ఘటనలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బీజేపీ మహిళా ఎంపీలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాజాగా ఓ బహిరంగ సభలో దిశ, ఉన్నావ్ హత్యాచార ఘటనలను ఉద్దేశిస్తూ.. భారత్ రేప్‌లకు రాజధానిగా మారుతుందంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. మరోసభలో మేక్ ఇన్ ఇండియా కాస్త.. రేప్ ఇన్ ఇండియాగా మారుతుందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో బీజేపీ శ్రేణులు.. రాహుల్ వ్యాఖ్యలపై  తీవ్ర స్థాయిలో […]

రాహుల్ వ్యాఖ్యలపై మహిళా ఎంపీల ఆగ్రహం.. క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్

Edited By:

Updated on: Dec 13, 2019 | 12:58 PM

శుక్రవారం లోక్‌సభ అట్టుడికిపోయింది. ఇటీవల జరిగిన వరుస హత్యాచార ఘటనలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బీజేపీ మహిళా ఎంపీలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాజాగా ఓ బహిరంగ సభలో దిశ, ఉన్నావ్ హత్యాచార ఘటనలను ఉద్దేశిస్తూ.. భారత్ రేప్‌లకు రాజధానిగా మారుతుందంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. మరోసభలో మేక్ ఇన్ ఇండియా కాస్త.. రేప్ ఇన్ ఇండియాగా మారుతుందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో బీజేపీ శ్రేణులు.. రాహుల్ వ్యాఖ్యలపై  తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం పార్లమెంట్‌లో రాహుల్ వ్యాఖ్యల అంశాన్ని పలువురు బీజేపీ మహిళా ఎంపీలు లేవనెత్తారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలంటూ మహిళా ఎంపీలు డిమాండ్ చేశారు.

‘మేకిన్‌ ఇండియా’ ప్రోగ్రాంను అత్యాచారాలతో పోల్చడంపై స్మృతీ ఇరానీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాహుల్ అసలు దేశ ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారో చెప్పాలన్నారు. ఇక రాజ్యసభలో కూడా సేమ్ సీన్ రిపీట్ అవ్వడంతో.. ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు స్పందించారు. సభలో లేని వ్యక్తి పేరును చెప్పడం సరికాదంటూ ఎంపీలకు సూచించారు.