‘క్విట్ ఇండియా యానివర్సరీ’.. యూపీలో 9 న రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ భారీ నిరసన ప్రదర్శనలు

| Edited By: Phani CH

Aug 07, 2021 | 8:39 PM

క్విట్ ఇండియా యానివర్సరీని పురస్కరించుకుని ఈ నెల 9 న ఉత్తరప్రదేశ్ అంతటా భారీ నిరసన ప్రదర్శనలను, ర్యాలీలను నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.

క్విట్ ఇండియా  యానివర్సరీ.. యూపీలో 9 న రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ భారీ నిరసన ప్రదర్శనలు
Priyanka Gandhi
Follow us on

క్విట్ ఇండియా యానివర్సరీని పురస్కరించుకుని ఈ నెల 9 న ఉత్తరప్రదేశ్ అంతటా భారీ నిరసన ప్రదర్శనలను, ర్యాలీలను నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ధరల పెరుగుదల, నిరుద్యోగం, రైతుల నిరసన, దిగజారుతున్న శాంతి భద్రతలు తదితర సమస్యలపై సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని ఎండగట్టాలని పార్టీ తీర్మానించింది. 1942 ఆగస్టు 9 న మహాత్మా గాంధీ నేతృత్వాన నాడు దేశంలో క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది. ఆ తరువాత ఐదేళ్లకు 1947 ఆగస్టు 15 న బ్రిటీష్ వారి పాలన నుంచి దేశానికి స్వాతంత్య్రం లభించింది. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో సోమ, మంగళవారాల్లో యూపీలోని 403 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు..’బీజేపీ గద్దీ ఛోడో’ (బీజేపీ గద్దె దిగు) అనే నినాదాలతో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ మార్చ్ కార్యక్రమాలను, ర్యాలీలను విజయవంతం చేసే బాధ్యతను సుమారు 400 మందికి పైగా నాయకులకు అప్పగించినట్టు ఈ వర్గాలు వెల్లడించాయి.

యూపీలో బీజేపీ పాలన అంతం కావాలన్నదే తమ ధ్యేయమని,అందుకు తగిన ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అజయ్ కుమార్ భల్లా తెలిపారు. వచ్చే ఏడాది ఈ రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నేత ప్రియాంక గాంధీ ఆధ్వర్యాన తామంతా పని చేస్తామని..ఆమె ఇప్పటి నుంచే ఇందుకు కార్యాచరణ ప్రణాళికను రచిస్తున్నారని ఆయన చెప్పారు. ఇందులో భాగంగానే ఈ నెల 9 న రాష్ట్రంలో ఇంత భారీ ప్రొటెస్ట్ మార్చ్ లను నిర్వహిస్తున్నామన్నారు. ఇది విజయవంతమవుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలంతా వీటిలో పాల్గొంటారని ఆయన చెప్పారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Samsung Galaxy F62: శాంసంగ్‌ స్మార్ట్‌ ఫోన్‌పై బంపరాఫర్‌.. ఏకంగా రూ. 6000 తగ్గింపు. ఫీచర్లు కూడా సూపర్..

‘పూర్’ అంటూ రోజుకు వందల సార్లు ‘పాట’ పాడిన కాంగ్రెస్.. ఇదే ఆ పార్టీ హిపోక్రసీ .. ప్రధాని మోదీ ఆరోపణ