School Holidays: ఆ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. పాఠశాలల సెలవులు పొడిగింపు!

School Holidays Extends: విద్యార్థులకు సెలవులు వస్తున్నాయంటే చాలు ఎగిరి గంతులేస్తారు. ఈ జనవరి నెలలో చలి తీవ్రత, అలాగే పండగల సీజన్‌. దీని కారణంగా విద్యార్థులకు భారీగా సెలవులు ఉండనున్నాయి. అయితే కొన్ని తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ సెలవులు ఉంటే..

School Holidays: ఆ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. పాఠశాలల సెలవులు పొడిగింపు!
School Holidays

Updated on: Jan 07, 2026 | 4:23 PM

School Holidays Extends: విద్యార్థులకు సెలవులు వస్తున్నాయంటే చాలు ఎగిరి గంతులేస్తారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ సెలవులు ఉంటే.. ఇతర రాష్ట్రాల్లో చలి గాలుల తీవ్రత కారణంగా పాఠశాలలకు సెలవులను ప్రకటిస్తున్నారు. అయితే కొన్ని తీవ్రమైన చలి గాలుల కారణంగా పంజాబ్‌ రాష్ట్రంలో సెలవులను పొడిగించింది ప్రభుత్వం. ఇప్పటికే శీతాకాల సెలవులు కొనసాగుతున్నాయి. పైగా చలి గాలుల తీవ్రత కారణంగా ఈ సెలవులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలో చలి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పంజాబ్ ప్రభుత్వం అన్ని పాఠశాలలకు శీతాకాల సెలవులను జనవరి 13 వరకు పొడిగించింది. ఈ పాఠశాలల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, గుర్తింపు పొందిన పాఠశాలలు ఉన్నాయని పిటిఐ నివేదించింది. పిల్లలు, సిబ్బంది ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యా మంత్రి హర్జోత్ సింగ్ బెయిన్స్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Business Idea: కేవలం రూ.75 వేల పెట్టుబడితో ఏడాదికి రూ.6 లక్షల ఆదాయం.. అద్భుతమైన బిజినెస్‌ ఐడియా!

జనవరి 14న పాఠశాలలు పునఃప్రారంభం:

ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు జనవరి 14 నుండి యథావిధిగా ప్రారంభమవుతాయని బెయిన్స్ పంజాబీలో X పై పోస్ట్‌లో తెలిపారు. గతంలో పంజాబ్ ప్రభుత్వం డిసెంబర్ 24 నుండి డిసెంబర్ 31 వరకు రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. తరువాత రాష్ట్రంలో తీవ్రమైన చలి పరిస్థితులు, దట్టమైన పొగమంచు కారణంగా జనవరి 7 వరకు పొడిగించారు.

Vande Bharat Cost: వందే భారత్ రైలు తయారీకి ఎంత ఖర్చు అవుతుందో తెలిస్తే షాకవుతారు!

అయితే రాష్ట్రంలో అత్యంత శీతల ప్రదేశంగా బటిండా నిలిచింది. అత్యల్పంగా 4.6 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. అమృత్సర్‌లో 7.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత, లూథియానాలో 6.6 డిగ్రీల, పాటియాలాలో 7.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత, గురుదాస్‌పూర్‌లో 5.7 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రెండు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని చండీగఢ్‌లో 7.6 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.

 

ఇది కూడా చదవండి: Budget 2026: ఈ బడ్జెట్‌లో రైతులకు శుభవార్త రానుందా? పీఎం కిసాన్‌ సాయం రూ.10 వేలకు పెరగనుందా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి