Operation Sindoor: పాకిస్తానీ స్పైలకు చెక్‌.. పంజాబ్‌లో ఇద్దరు గూఢచారులు అరెస్ట్!

భారత్‌లో ఉంటూ దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించిన రహస్యాలను దాయాది దేశానికి చేరవేస్తున్న ఇద్దరు గుఢచారులను పంజాబ్‌ పోలీసులు కనిపెట్టారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్"కు సంబంధించిన వివరాలను వీరు పాకిస్థాన్‌కు చేరవేసినట్టు పోలీసులు గుర్తించారు. ఇలాంటి దేశ ద్రోహ చర్యలకు పాల్పడిన ఇద్దరు గూఢచారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు గురుదాస్‌పూర్‌కు చెందిన కరణ్‌బీర్ సింగ్‌, సుఖ్‌ప్రీత్ సింగ్ గా పోలీసులు గుర్తించారు.

Operation Sindoor: పాకిస్తానీ స్పైలకు చెక్‌.. పంజాబ్‌లో ఇద్దరు గూఢచారులు అరెస్ట్!
Arrest

Edited By:

Updated on: May 21, 2025 | 5:08 PM

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ తర్వాత భారత్‌-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. దీంతో భారత్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశ వ్యాప్తంగా మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో భద్రత చర్యలను ముమ్మరం చేసింది. అయితే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్‌లో ఉన్న పాకిస్తాన్ గూఢచార వ్యవస్థలన్ని బయటపడుతున్నాయి. ఈ క్రమంలోనే భారత్‌లో ఉంటూ దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించిన రహస్యాలను దాయాది దేశానికి చేరవేస్తున్న ఇద్దరు గుఢచారులను పంజాబ్‌ పోలీసులు కనిపెట్టారు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌కు చెందిన కరణ్‌బీర్ సింగ్‌, సుఖ్‌ప్రీత్ సింగ్‌లు ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన వివరాలను పాకిస్తాన్‌కు చేరవేసినట్టు గుర్తించారు. ఈ ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఈ ఇద్దరు ‘ఆపరేషన్ సిందూర్’కు సంబంధించిన వివరాలతో పాటు, జమ్మూకాశ్మీర్‌, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, రాష్ట్రాల్లోని ఇండియన్ ఆర్మీ, భద్రత బలగాల కదలికలను పాకిస్తాన్‌కు ఉప్పందించినట్లు గుర్తించారు. అంతే కాకుండా వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాల సమాచారాన్ని కూడా పాకిస్థాన్ నిఘా సంస్థ అయిన ఐఎస్ఐకి పంపించినట్టు పంజాబ్ పోలీసులు గుర్తించారు. జాతీయ నిఘా వర్గాల సమాచారం మేరకు ఈ ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి ఫోన్లను తనిఖీ చేశారు. వారి ఫోన్‌లలో భారత్ కు సంబంధించిన వివరాలు పాకిస్తాన్‌లోని ఐఎస్ఐ నిఘా సంస్థకు పంపిన ఆనవాళ్లను గుర్తించారు.

అయితే ఈ ఇద్దరు వ్యక్తులు గత 20 రోజులుగా భారత్‌లో జరుగుతున్న అప్‌డేట్స్‌తో పాటు రహస్య సమాచారాన్ని పాకిస్తాన్‌ను పంపిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. వీరు గత కొన్ని రోజులుగా డ్రగ్స్‌ వాడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరి నుంచి మూడు ఫోన్లతో పాటు 8 లైవ్ క్యాట్రిడ్జ్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఇద్దరి నిందితుల బ్యాంక్‌ ఖాతాలో రూ.లక్ష జమ అయినట్లు బోర్డర్ రేంజ్ డీఐజీ సతీందర్ సింగ్ తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..