Punjab Election 2022: పంజాబ్‌ ముఖ్యమంత్రిని ఓడించిన సామాన్యుడు.. అతని గురించి తెలుసా.?

|

Mar 11, 2022 | 4:51 PM

Punjab Election 2022: పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) సంచలనం సృష్టించింది. ఎన్నికల సింబల్‌కు తగ్గట్టుగానే మిగతా పార్టీలను ఊడ్చిపారేసింది..

Punjab Election 2022: పంజాబ్‌ ముఖ్యమంత్రిని ఓడించిన సామాన్యుడు.. అతని గురించి తెలుసా.?
Follow us on

Punjab Election 2022: పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) సంచలనం సృష్టించింది. ఎన్నికల సింబల్‌కు తగ్గట్టుగానే మిగతా పార్టీలను ఊడ్చిపారేసింది. 117 స్థానాలు ఉన్న పంజాబ్‌‌లో ఆప్ ఏకంగా 92 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఆప్‌ అభ్యర్ధుల చేతిలో హేమాహేమీలు ఓడిపోవడం గమనార్హం. అయితే పంజాబ్‌ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చరణ్‌జిత్ సింగ్ పోటీ చేసిన రెండు చోట్లల్లో ఓడిపోయాడు. చమ్‌కౌర్ సాహిబ్, బదౌర్ స్థానాలలో ఆప్‌ అభ్యర్ధుల చేతిలో ఓటమిని చవి చూశారు చన్నీ. అయితే బదౌర్‌లో చన్నీని ఓడించింది ఎవరో తెలుసా..? మొబైల్ రిపేర్ షాపులో పనిచేసే ఆప్ అభ్యర్ధి లబ్‌‌ సింగ్ ఉగోకే (Labh Singh Ugoke,). ఇప్పుడు ఇతని గురించి చాలా మంది సెర్చ్ చేస్తున్నారు. 35 ఏళ్ల లబ్‌‌సింగ్ ఉగోకే 1987లో పుట్టాడు. 12వ తరగతి వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత మొబైల్ ఫోన్ రిపేర్‌లో డిప్లొమా కోర్సును నేర్చుకున్నాడు. ఆయన తండ్రి డ్రైవర్ కాగా, అతని తల్లి ప్రభుత్వ పాఠశాలలో స్వీపర్‌‌గా పనిచేస్తోంది.

2013లో ఉగోకే స్వచ్ఛందంగా ఆప్‌లో చేరిన లబ్‌‌ సింగ్ ఉగోకేకి ఇప్పుడు పోటీ చేసే అవకాశం వచ్చింది.. అది కూడా సీఎం చన్నీ పైన.. అయినప్పటికీ ఎక్కడ కూడా విశ్వాసం కోల్పోలేదు.. గెలుస్తానన్న నమ్మకాన్ని వదులుకోలేదు.. ఫైనల్ గా చన్నీపై 37,558 ఓట్ల తేడాతో విజయం సాధించాడు. ఇక 2017లో బదౌర్ అసెంబ్లీ స్థానం నుంచి ఆప్ అభ్యర్థి పిర్మల్ సింగ్ ధౌలా గెలుపొందారు. అయితే ధౌలా గతేడాది కాంగ్రెస్‌లో చేరారు. ఈ సారి అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం లబ్‌‌సింగ్ ఉగోకే దక్కింది. పంజాబ్ రాష్ట్రంలో ఆప్ భారీ విజయాన్ని సాధించిన తర్వాత పంజాబ్ ఓటర్లను ఉద్దేశించి పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడారు. అందులో భాగంగానే చరణ్‌జిత్ సింగ్‌ను ఎవరు ఓడించారనే విషయాన్ని తెలియజేశారు. లబ్‌‌సింగ్ ఉగోకే అని చెప్పుకొచ్చారు కేజ్రివాల్. ఇక ప్రజల తీర్పును గౌరవిస్తున్నానని, పంజాబ్‌‌లో గెలిచిన ఆప్‌కు, భగవంత్‌‌ మన్‌‌కు అభినందనలని చన్నీ ట్వీట్ చేశారు.

ఇక పంజాబ్ సీఎంగా ఉన్న కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్ అంత‌ర్గత కుమ్ములాట‌ల కార‌ణంగా కాంగ్రెస్ కు గుడ్‌బై చెప్పేశారు. ఈ స‌మ‌యంలోనే పంజాబ్ సీఎంగా కాంగ్రెస్ అధిష్ఠానం చెన్నీని తెర‌పైకి తెచ్చింది. చెన్నీ సీఎం పీఠం ఎక్కడ‌మే ఆల‌స్యం.. అంతర్గత కుమ్ములాట‌లు మ‌రింత పెరిగాయి. న‌వ‌జ్యోత్ సింగ్ సిద్దూ వ‌ర్సెస్ చెన్నీగా మారిపోయాయి. చివ‌రికి సిద్దూకు పీసీసీ ప‌గ్గాలు అప్పజెప్పింది అధిష్ఠానం. అయినా వీరిద్దరి మధ్య క‌ల‌హాలు మాత్రం ఏ మాత్రం తగ్గలేవు. ఇక‌.. ద‌ళిత వ‌ర్గానికి చెందిన చెన్నీని సీఎం పీఠంపై కూర్చోబెట్టాం కాబ‌ట్టి.. బాగా క‌లిసొస్తుంద‌ని కాంగ్రెస్ అంచ‌నా వేసింది. కానీ చివరకు అంచ‌నాలు తలకిందులయ్యాయి.

ఇవి కూడా చదవండి:

Anurag Thakur: యూపీ కురుక్షేత్రంలో బీజేపీకి అక్కరకొచ్చిన యువనాయకుడి రాజకీయ చాణక్యత..

AAP: చిన్న ప్రాంతీయ పార్టీగా మొదలై.. నేడు జాతీయ పార్టీలనే ఊడ్చేస్తోంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ సక్సెస్‌ జర్నీ..