రాహుల్ గాంధీతో నవ జ్యోత్ సింగ్ సిద్దు భేటీ… 48 గంటల్లో పంజాబ్ నేతకు కీలక పదవి ..?

| Edited By: Phani CH

Jun 30, 2021 | 11:04 PM

పంజాబ్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి నవ జ్యోత్ సింగ్ సిద్దు బుధవారం సాయంత్రం ఢిల్లీలో పార్టీ నేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు.

రాహుల్ గాంధీతో నవ జ్యోత్ సింగ్ సిద్దు భేటీ... 48 గంటల్లో పంజాబ్ నేతకు కీలక పదవి ..?
Navjot Singh Sidhu
Follow us on

పంజాబ్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి నవ జ్యోత్ సింగ్ సిద్దు బుధవారం సాయంత్రం ఢిల్లీలో పార్టీ నేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. అంతకు ముందు ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో సుమారు గంట సేపు సమావేశమయ్యారు.పంజాబ్ కాంగ్రెస్ ను ప్రక్షాళన చేయాలని..సాధ్యమైనంత త్వరగా ఇది జరగాలని ఆయన ఆమెను కోరారు. ఇలా ఉండగా వచ్చే 48 గంటల్లో పార్టీ నాయకత్వం సిద్దుకు కీలక పదవిని కట్టబెట్టవచ్చునని తెలుస్తోంది. తమ రాష్ట్ర సీఎం కెప్టెన్ అమరేందర్ సింగ్ నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సిద్దు…ప్రియాంక గాంధీ సూచించిన ఫార్ములాను అంగీకరించినట్టు చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించిన వివరాలు తెలియలేదు. నిజానికి సిద్దును కలిసేందుకు రాహుల్ మొదట నిరాకరించారని వార్తలు వచ్చాయి. అయితే ఢిల్లీలో పరిణామాలు చకచకా మారాయి. సిద్దును పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ గానో.. డిప్యూటీ సీఎం గానో నియమిస్తే తాను అంగీకరించబోమని కెప్టెన్ అమరేందర్ సింగ్ అంటున్నారు.

మరి ఈ రెండు పదవుల్లో ఏ పదవిలోనైనా సిద్దు ను నియమిస్తే..కెప్టెన్ సాబ్ పరిస్థితి ఏమిటని విశ్లేషకులు తర్జన భర్జన పడుతున్నారు. ప్రస్తుతం పంజాబ్ లో కాంగ్రెస్ పరిస్థితి కుమ్ములాటలు మధ్య సాగుతోంది. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు బాహాటంగానే ప్రకటనలు చేస్తున్నారు. వచ్చే ఏడాది ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బహుశా ఫిబ్రవరి లేదా మార్చిలో ఎలెక్షన్స్ జరగవచ్చు.. ఈ కారణం వల్లే రాష్ట్ర కాంగ్రెస్ లో రెండు వర్గాలు ఏర్పడినట్టు భావిస్తున్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Osmania University Exams: ఓయూ పరిధిలో జరగాల్సిన డిగ్రీ 3, 4వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదల..

హద్దులు దాటకండి…రైతులకు హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ హెచ్చరిక…ఘర్షణలపై ఖండన