Punjab Election Results 2022: పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ భారీ విజయాన్ని కైవసం చేసుకుంది. 117 స్థానాలున్న పంజాబ్‌లో ఆప్‌కు 92 స్థానాలు గెలుపొంది.. తిరుగులేని పార్టీగా అవతరించింది. ఆప్ ప్రభంజనం ముందు.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ ఎన్నికల్లో ఆప్ జోరుకు అగ్రనేతలందరూ ఓటమి పాలయ్యారు. ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్నీ సహా కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ, మాజీ సీఎంలు కెప్టెన్ అమరీందర్ సింగ్, ప్రకాశ్ సింగ్ బాదల్ వంటి దిగ్గజ నేతలు ఓటమిని చవిచూశారు. సీఎం చరణ్‌జీత్ సింగ్ చన్నీ ఈ ఎన్నికల్లో పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓటమి పాలయ్యారు. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ తిరుగులేని మెజారిటీతో అధికారం చేజిక్కించుకుంది.
117 స్థానాలున్న పంజాబ్‌లో ఎవరికన్ని స్థానాలంటే..?
ఆమ్ ఆద్మీ పార్టీ 92 సీట్లు
కాంగ్రెస్‌కు 18
భారతీయ జనతా పార్టీ 2
శిరోమణి అకాలీదళ్ 3
బీఎస్పీ 1
సంతంత్ర అభ్యర్థి 1
పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్..
పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. AAP సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ ధురీ నుంచి పోటీ చేసి 58,206 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. భగవంత్ మాన్.. ప్రస్తుతం సంగ్రూర్ లోక్‌సభ నియోజకవర్గానికి ఆప్ ఎంపీగా ఉన్నారు.
#PunjabAssemblyElections2022Results | Out of 117 seats, the Aam Aadmi Party wins 92 seats, Congress gets 18 and Bharatiya Janata Party grabs only two seats
Shiromani Akali Dal got only 3 seats, and one seat each was won by an independent candidate & BSP pic.twitter.com/PpaNhk3FNv
— ANI (@ANI) March 10, 2022
Also Read: