AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pune Accident: పూణె-షోలాపూర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. బోల్తా పడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు..

పూణె-షోలాపూర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బోల్తా పడింది. ఈ ఘటనలో 12 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

Pune Accident: పూణె-షోలాపూర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. బోల్తా పడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు..
Accident
Shiva Prajapati
|

Updated on: Apr 24, 2023 | 11:54 PM

Share

పూణె-షోలాపూర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బోల్తా పడింది. ఈ ఘటనలో 12 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ బస్సు ముంబై నుంచి నిజామాబాద్‌కు వస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 50-60 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. దౌండ్‌లోని భండ్‌గావ్ గ్రామ సమీపంలో పూణె-సోలాపూర్ హైవేపై ద్విచక్రవాహనం అడ్డు రాగా, దాన్ని తప్పించే ప్రయత్నంలో ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ముంబై నుంచి నిజామాబాద్‌కు వెళ్తుండగా రాత్రి 8.30 గంటల ప్రాంతంలో బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 12 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా.. మరికొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని, అందరి ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

కాగా, ప్రమాదం తరువాత బస్సు డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయినట్లు బస్సులోని మిగతా ప్రయాణికులు తెలిపారు. ఇక ఈ ప్రమాదంలో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. రోడ్డుకు ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రోడ్డుకు అడ్డంగా పడిన బస్సును తొలగించారు. ట్రాఫిక్ జామ్‌ను క్లియర్ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..